NADA NEERAJANAM HOSTS SWARA NEERAJANAM _ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక‌ శోభ

TIRUMALA, 28 SEPTEMBER 2022: A series of events organized on Nada Neerajanam and Astana Mandapam under the aegis of the HDPP wing of TTD attracted devotees with Bhakti Sangeet and devotional dance as a part of ongoing bramhotsavams in Tirumala on Wednesday.

The cultural events include Mangala Dhwani by Smt Lakshmi Suvarna, Vishnu Sahasranamam by Smt Vanisri and group, dance by Smt Sailaja and troupe, Annamaiah Vinnapalu by Sri Subramanyam and Sri Muniratnam Reddy, Harikatha by Smt Vijayakumari fascinated the pilgrim devotees in these two venues at Tirumala.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక‌ శోభ

తిరుమల, 2022 సెప్టెంబ‌రు 28 ;శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపం, తిరుప‌తిలోని మ‌హ‌తి క‌ళాక్షేత్రం, అన్న‌మాచార్య క‌ళామందిరం, శ్రీ‌రామ‌చంద్ర పుష్క‌రిణి వద్ద ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు శ్రీవారి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇందులో భాగంగా తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధ‌వారం ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత‌, నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ‌మ‌తి బి.లక్ష్మీ సువర్ణ బృందం మంగళధ్వని కార్య‌క్ర‌మం జరిగింది. తిరుమ‌ల ఆస్థాన‌మండ‌పంలో ఉదయం 10 నుండి 11 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ‌మ‌తి ఆర్‌.వాణిశ్రీ బృదం విష్ణుసహస్రనామ పారాయ‌ణం, ఉదయం 11 నుండి 12.30 గంటల వరకు ఎస్వీ సంగీత‌, నృత్య క‌ళాశాలకు చెందిన శ్రీ‌మ‌తి పి.శైల‌జ బృందం భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

సాయంత్రం 4 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తికి చెందిన శ్రీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, శ్రీ పి.మునిర‌త్నంరెడ్డి అన్న‌మ‌య్య విన్న‌పాలు సంగీత కార్య‌క్ర‌మం, రాత్రి 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌మ‌తి విజ‌య‌కుమారి హ‌రిక‌థాగానం చేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.