NAGULA CHAVITI PEDDA SESHA VAHANAM IN TIRUMALA ON OCT. 23_ అక్టోబరు23న పెద్దశేషవాహనంపై విహరించనున్న శ్రీ మలయప్పస్వామివారు
Tirumala, 22 October 2017: In connection with the auspicious festival of Nagula Chaviti on October 23, the processional deity of Sri Malayappa Swamy flanked by His two consorts Sridevi and Bhudevi, takes celestial ride on the seven hooded Pedda Sesha Vahanam.
It will be a visual treat to watch the Lord and His consorts on the mighty serpent king. Pedda Sesha Vahanam is revered to be Adisesha.
According to Hindu mythology, Adisesha, is a 1000 hooded mighty snake who serves His master in various forms as His divine bed, umbrella, ornaments, seat etc. and showcases His loyalty towards His Master.
On Monday evening, the Lord will ride on Pedda Sesha Vahanam in four mada streets between 7pm and 9pm and bless the devotees.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI
అక్టోబరు23న పెద్దశేషవాహనంపై విహరించనున్న శ్రీ మలయప్పస్వామివారు
అక్టోబరు 22, తిరుమల 2017: అక్టోబరు 23న నాగుల చవతి పర్వదినం సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు తన ఉభయ దేవేరులతో కూడి తిరుమల నాలుగు మాడ వీధులలో పెద్దశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేయనున్నారు.
కాగా సర్పరాజైన ఆదిశేషువు జగన్నాధునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా , పాదుకలుగా, శయ్యలాగా, ఛత్రంగా, కామరూపియై వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా స్వామివారికి సేవలందిస్తున్నట్లు పురాణాలు ఘోషిస్తున్నాయి. అంతే కాకుండా శ్రీవారి ఆలయంలోని దాదాపు 8 శాసనాలపై శేషునిపై అనేక స్తుతి సూక్తులున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామలలో ”శేషసాయి, శేషస్త్యుః, శేషాద్రినిలయః” అంటూ నిత్య పూజలందుకుంటున్నాడు.
అంతే కాకుండా రామావతారంలో లక్ష్మణునిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీ వైకుంఠంలోని నిత్య సూరులలో ఆద్యుడు. ఈ విధంగా స్వామివారు దాస భక్తికి మారు రూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషువుపై ఉభయదేవేరులతో కూడి భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగత ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపజేస్తున్నారు. అందుకే బ్రహ్మూెత్సవ వాహనసేవలలో తొలి ప్రాధాన్యత కూడా ఆదిశేషునికే ఆ భగవంతుడు ప్రసాదించాడు.
కాగా నాగుల చవతి పర్వదినంనాడు రాత్రి 7.00 గంటల నుండి 9.00 గంటల నడుమ తిరుమాడ వీధులలో పెద్ద శేషవాహనంపై ఊరేగింపు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తి.తి.దే ఆధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.