NAKSHATRA SATRA YAGAM CONCLUDED _ శాస్త్రోక్తంగా ముగిసిన నక్షత్రసత్ర మహాయాగం

Tirumala, 15 Jun. 21: Seeking the divine intervention to rescue humanity from the clutches of Covid, TTD has mulled a unique Nakshatra Satra Yagam which concluded in Tirumala on Tuesday.

This religious event took place in Dharmagiri Veda Vignana Peetam at Tirumala. This unique Yagam began on May 9. Each day dedicated to a star in the constellation as per the Hindu almanac and the exam was performed with religious fervour. Apart from the 27 stars in Hindu scriptures, Yagam was also performed on Abhijit star.

Apart from the star yagams, Srouta yagams were also performed invoking the blessings of Sri Surya Bhagavan, Chandra, Nakshatra Samanya, Aditi and Yagna Swaroopa Vishnu.

This Yagam took place under the supervision of Dharmagiri Veda Vignana Peetham Principal Sri KSS Avadhani.

Ritwiks and Vedic faculty were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శాస్త్రోక్తంగా ముగిసిన నక్షత్రసత్ర మహాయాగం

తిరుమల, 2021 జూన్ 15: కరోనా వ్యాధిని నిర్ములించి ప్రపంచ మానవాళి ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని శ్రీవారిని ప్రార్థిస్తూ టిటిడి నిర్వహిస్తున్న నక్షత్రసత్ర మహాయాగం ధర్మగిరి వేదవిజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్ అవధాని ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం శాస్త్రోక్తంగా ముగిసింది. తిరుమ‌ల ధర్మగిరి వేద పాఠశాలలో ఈ కార్య‌క్ర‌మం మే 9వ తేదీ నుండి జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.

ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం ఉదయం వైష్ణ‌వేష్ఠి నిర్వ‌హించారు. దీనికి ప్ర‌ధాన దేవ‌త శ్రీ మ‌హావిష్ణువు. మొద‌ట గ‌ణ‌ప‌తి పూజ‌, గురువంద‌నం, శ్రీ‌వారికి మంగ‌ళాశాస‌న‌ముల‌తో కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. అనంత‌రం సంక‌ల్ప పూజ నుండి అవ‌బృదం వ‌ర‌కు చేసి ఆశీర్వ‌చ‌నంతో ఇష్ఠిని ప‌రిపూర్ణం చేశారు. దీనితో న‌క్ష‌త్ర‌స‌త్ర మ‌హాయాగం సంపూర్ణంగా ముగిసింది.

కాగా, మే 9, 10, 11వ తేదీల్లో పూర్వాంగభూతములైన శ్రౌతయాగాలు నిర్వహించారు. మే 12 నుండి కృత్తికా నక్షత్రం నుంచి భరణి నక్షత్రం వరకు అభిజిత్ నక్షత్రం సహా 28 నక్షత్రాల అధిష్టాన దేవతలకు శ్రౌతయాగాలు నిర్వహించారు. తరువాత చంద్రుడు, అహోరాత్రములు, ఉషఃకాలం, నక్షత్ర సామాన్యము‌, సూర్య భగవానుడు, దేవమాత అయిన అదితి, యజ్ఞ స్వరూపుడైన విష్ణువుకు శ్రౌతయాగాలు నిర్వహించారు.

ప్రపంచంలోని ప్రజలందరూ 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో జన్మించి ఉంటారని, ఈ యాగాల ద్వారా ఆయా అధిష్టాన దేవతలు తృప్తి చెంది విశేషమైన ఫలితాలు సిద్ధిస్తాయ‌ని వేద పండితులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ధర్మగిరి వేద పాఠశాల అధ్యాపకులు, ఋత్వికులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.