NAVANEETA KRISHNA SHOWERS BLESSINGS _ సహస్రదీపాలంకార సేవలో నవనీతకృష్ణుడి అలంకారంలో శ్రీనివాసుని కటాక్షం

PRIYA SISTERS DUO ENHANCE THE DEVOTIONAL SPIRIT

HYDERABAD, 13 OCTOBER 2022: On the third day of the ongoing Sri Venkateswara Vaibhavotsavams at Hyderabad, Lord as Navaneeta Krishna showered Hid benign blessings upon the devotees during Sahasra Deepalankara Seva.

In the night the Poolangi Seva of the presiding deity mesmerized the denizens who thronged the venue.

The devotional musical feast provided by the renowned sister duo, Smt  Shanmukha Priya and Smt Hari Priya enhanced the Bhakti among devotees.

On October 15, on the last day, Pushpayagam will be observed between 8:30am and 10:30am while the celestial Srinivasa Kalyanam on the same day evening between 6:30pm and 8:30pm.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సహస్రదీపాలంకార సేవలో నవనీతకృష్ణుడి అలంకారంలో శ్రీనివాసుని కటాక్షం
 
– అక్టోబరు 15న పుష్పయాగం, శ్రీనివాస కల్యాణం
 
హైదరాబాద్, 2022 అక్టోబరు 13: హైదరాబాద్ లో టిటిడి నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో మూడో రోజు గురువారం సాయంత్రం సహస్రదీపాలంకార సేవలో నవనీతకృష్ణుడి అలంకారంలో  శ్రీనివాసుడు భక్తులను కటాక్షించారు.  స్వామివారు ఉల్లాసంగా ఊయలలో ఊగుతూ భక్తులకు కనువిందు చేశారు. నిత్యం అవిశ్రాంతంగా భక్తులకు దర్శనభాగ్యాన్ని ప్రసాదించే స్వామివారు సహస్రదీపాలంకార సేవతో సేద తీరుతారు.
 
ముందుగా వేద పండితులు చతుర్వేద పారాయణం చేశారు. ఆ తరువాత  టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ సరస్వతి ప్రసాద్ బృందం ‘ ముద్దుగారే యశోద…’, ‘లాలనుచునుచేరు…’, అన్నమయ్య సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. హైదరాబాదుకు చెందిన కుమారి రిషిత పురందరదాస కీర్తనలను గానం చేశారు. ఆ తరువాత మంగళవాయిద్యంతో వాద్యనీరాజనం సమర్పించారు.
 
సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు వేదిక చుట్టూ స్వామివారు తిరుచ్చిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు రాత్రి కైంకర్యాలు, పూలంగి సేవ నిర్వహిస్తారు. రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు ఏకాంతసేవ జరుగనుంది.
 
అలరించిన ప్రియా సిస్టర్స్ గాత్ర సంగీతం 
 
సహస్రదీపాలంకరణ సేవ అనంతరం ప్రముఖ సంగీత విద్వాంసులు ప్రియా సిస్టర్స్ గా ప్రసిద్ధి చెందిన శ్రీమతి షణ్ముఖ ప్రియ, శ్రీమతి హరిప్రియ ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 
 
అక్టోబరు 15న పుష్పయాగం, శ్రీనివాస కల్యాణం
 
శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల చివరి రోజైన అక్టోబర్ 15వ తేదీ శనివారం ఉదయం 8.30 నుండి 10.30 గంటల వరకు పుష్పయాగం జరుగనుంది. సాయంత్రం 6.30 రాత్రి 8.30 గంటల వరకు శ్రీనివాస కళ్యాణం జరుగనుంది. భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.