NCISM LAUDS TTD AYUR SERVICES _ టీటీడీ ఆయుర్వేద వైద్య సేవలు అభినందనీయం – ఎన్ సి ఐ ఎస్ ఎం చైర్మన్ డాక్టర్ జయంత్ యస్వంత్

TIRUPATI, 13 APRIL 2022: The National Commission for Indian System of Medicine (NCISM) has lauded the services of TTD Ayurveda to the needy.

The Director of NCISM who visited SV Ayurvedic College and Hospital on Wednesday evening observed the services being offered to the patients. He later interacted with the students, faculty, doctors and Hospital staff and said the new Ayurvedic syllabus will give the Nation young Ayurvedic Physicians which is useful for future India in a big way.

He also happened to see the modern equipment and their functioning was explained by Principal Dr Muralikrishna.

Later he paved a visit to Panchagavya Manufacturing Unit. Dr Muralikrishna also explained the NCISM Chief the Panchagavya products which have already received AYUSH licence and the also those which yet to be approved.

Vice Principal Dr Sundaram, Dr Dorothy, Dr Renu Dikshit were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI 

టీటీడీ ఆయుర్వేద వైద్య సేవలు అభినందనీయం
– ఎన్ సి ఐ ఎస్ ఎం చైర్మన్ డాక్టర్ జయంత్ యస్వంత్

తిరుపతి 13 ఏప్రిల్ 2022: టీటీడీ ప్రజలకు అందిస్తున్న ఆయుర్వేద వైద్య సేవలు అభినందనీయమని నేషనల్ కమీషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ చైర్మన్ డాక్టర్ జయంత్ యస్వంత్ దేవ్ పూజారి అభినందించారు.

శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల, వైద్య శాల ను బుధవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఆసుపత్రిలో అందిస్తున్న ఉచిత వైద్య సేవలను ప్రశంసించారు. అనంతరం కళాశాల అధ్యాపకులు, వైద్య సిబ్బంది, విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ జయంత్ మాట్లాడుతూ, నూతన ఆయుర్వేద పాఠ్య ప్రణాళిక భవిష్యత్తు లో ఉత్తమ ఆయుర్వేద వైద్యులను తయారు చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఆయుర్వేద వైద్యానికి పెద్ద స్థాయిలో రాబోయే ఆదరణ గురించి వివరించారు.

ఆ తరువాత ఆయుర్వేద ఫార్మసీని సందర్శించారు. ఫార్మసీ అభివృద్ధికి చేపట్టిన నిర్మాణాలు, కొనుగోలు చేస్తున్న అధునాతన యంత్రాల గురించి ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ వివరించారు. ఇప్పటికే తయారు చేస్తున్న ఆయుర్వేద మందులు, కొత్తగా ఆయుష్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసిన మందుల గురించి తెలిపారు. అనంతరం పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని సందర్శించారు.

వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుందరం, డాక్టర్ దోరతి, డాక్టర్ రేణు దీక్షిత్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది