NEW BOARD MEMBER SWORN IN_ టిటిడి ధర్మకర్తల మండలి సభ్యునిగా శ్రీ వేనాటి రామ‌చంద్రారెడ్డి ప్రమాణస్వీకారం

Tirumala, 21 February 2019: Sri Venati Ramachandra Reddy of Nellore, took oath as TTD Trust Board member in Tirumala on Thursday in Srivari temple.

After the oath taking, he had darshanam of Lord Venkateswara. Later the vedic pundits offered Vedasirvachanam at Ranganayakula Mandapam. He was presented with Theertha Prasadams by temple officials.

DyEO Temple Sri Harindranath, DyEO Board Cell Smt Malleswari, Peishkar Sri Ramesh Babu were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

టిటిడి ధర్మకర్తల మండలి సభ్యునిగా శ్రీ వేనాటి రామ‌చంద్రారెడ్డి ప్రమాణస్వీకారం

ఫిబ్ర‌వ‌రి 21, తిరుమల, 2019: టిటిడి ధర్మకర్తల మండలి సభ్యునిగా నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీ వేనాటి రామ‌చంద్రారెడ్డి గురువారం ఉద‌యం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణస్వీకారం చేశారు. ప్ర‌మాణం అనంత‌రం స్వామివారిని ద‌ర్శించుకున్నారు. ఆ త‌రువాత రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, బోర్డు సెల్ డెప్యూటీ ఈవో శ్రీమతి సి.మల్లీశ్వరిదేవి, పేష్కార్ శ్రీ రమేష్‌బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.