NINTH PHASE AKANDA SUNDARAKANDA PATHANAM ON JANUARY 27 _ జ‌న‌వ‌రి 27న నాద‌నీరాజ‌నం వేదిక‌పై 9వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయ‌ణం

Tirumala, 20 Jan. 21: The ninth phase of Akhanda Sundarakanda Pathanam on Nada Neerajanam platform will be observed on January 27 between 7am and 9am at Tirumala.

A total of 186 Shlokas from 36 to 38 Sargas (three chapters) will be recited on that day by the Vedic scholars.

It may be mentioned here, that the Sundarakanda Pathanam was commenced to save the humanity from the clutches of the dreadful Corona Virus from June 11 onwards once TTD resumed Darshan for pilgrims after the relaxation of COVID 19 lockdown restrictions.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

జ‌న‌వ‌రి 27న నాద‌నీరాజ‌నం వేదిక‌పై 9వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయ‌ణం

తిరుమల, 2021 జ‌న‌వ‌రి 20: కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై జ‌న‌వ‌రి 27వ తేదీన 9వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు.

బుధ‌వారం ఉద‌యం 7 గంటల నుండి సుందరకాండలోని 36వ సర్గ నుంచి 38వ సర్గ వరకు ఉన్న 186 శ్లోకాలను పారాయణం చేస్తారు. తిరుమల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం, తిరుప‌తిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయ‌ణంలో పాల్గొంటారు.

శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది. ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా శ్రీ‌వారి భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.