NO RECRUITMENT TAKEN UP IN TTD -TTD CONDEMNS THE FALSE PROPAGANDA ON SOCIAL MEDIA_ టిటిడి భద్రతా విభాగంలో ఎలాంటి నియామకాలు చేపట్టలేదు
Tirumala, 11 July 19: Seriously condemning the false publicity which is making rounds in the social media about recruitment in TTD security for the posts of guards, the temple management appealed to the devotees not to fall prey to such fake publicity.
On the otherhand, TTD vigilance sleuths are also investigating and getting ready to face legally on the false publicity given by one Bhimala Vijaya Krishna Naidu with watsapp number 9652177776 registered on his name in social media.
TTD is appealing to the devotees especially to the unemployed youth to make note that it will never release any sort recruitment or employment related news on social media.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి భద్రతా విభాగంలో ఎలాంటి నియామకాలు చేపట్టలేదు
సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగ ప్రకటనలు అవాస్తవం : టిటిడి
జూలై 11, తిరుమల, 2019: తిరుమల శ్రీవారి ఆలయ భదత్రా విభాగంలో సెక్యూరిటీ గార్డుల నియామకం జరుగుతోందని సామాజిక మాధ్యమాల్లో కొందరు విడుదల చేసిన ప్రకటనల్లో ఎలాంటి వాస్తవం లేదని టిటిడి తెలియజేస్తోంది.
ఇలాంటి ప్రకటనలు చూసి నిరుద్యోగులు మోసపోవద్దని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. సదరు ప్రకటనలు జారీ చేసిన భీమల విజయకృష్ణనాయుడుపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సదరు వ్యక్తి ఫోన్ నంబరు, వాట్సాప్ నంబరు 9652177776 ద్వారా జరుగుతున్న మోసపూరిత ప్రచారంపై టిటిడి నిఘా విభాగం విచారణ చేపడుతోంది. సామాజిక మాధ్యమాల్లో టిటిడి ఎలాంటి ఉద్యోగ ప్రకటనలు జారీ చేయదు. నిరుద్యోగులు ఈ విషయాన్ని గుర్తించాలని టిటిడి కోరుతోంది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.