OGGUDOLU AND PILLANAGROVI HELD THE SHOW _ ముత్యపు పందిరి వాహన‌సేవ‌లో ఆక‌ట్టుకున్న, ఒగ్గుడోలు, పిల్లనగ్రోవి భజన

TIRUPATI, 22 NOVEMBER 2022: As part of the ongoing annual brahmotsavams in Tiruchanoor, among the cultural items performed in front of the Mutyapu Pandiri Vahana Seva on Tuesday morning, the performances by various cultural troupes attracted the devotees.

Among the traditional folk arts, Oggudolu, Ammavari Ghattam by the teams from Telengana amused the devotees who converged in large numbers for the vahana seva.

Similarly the performances of Pillanagrovi by Nimmanapalle artistes troupe from Chittoor district, Siva-Kesava kolatam by Rajamundry artistes, Tirupati troupes enchanted the pilgrim devotees.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ముత్యపు పందిరి వాహన‌సేవ‌లో ఆక‌ట్టుకున్న, ఒగ్గుడోలు, పిల్లనగ్రోవి భజన

తిరుపతి, 2022 న‌వంబ‌రు 22: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం ముత్యపు పందిరి వాహ‌న‌సేవ‌లో ఒగ్గుడోలు, పిల్లనగ్రోవి భజన క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు, దాస‌సాహిత్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటుచేశారు.

తెలంగాణ రాష్ట్రం జనగామకు చెందిన కళాకారులు ఒగ్గుడోలు, అమ్మవారి ఘట్టం, గిరిజన సాంప్రదాయ నృత్యం ప్రదర్శించారు. ఇందులో అమ్మవారి ఘట్ట ఆవిష్కరణ విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

పిల్లనగ్రోవి భజన

చిత్తూరు జిల్లా నిమ్మనపల్లికి చెందిన వెంకటరమణ భజన బృందం కళాకారులు గ్రామీణ సంప్రదాయ పిల్లనగ్రోవి భజనలు చేశారు.

అదేవిధంగా, రాజమండ్రికి చెందిన శివ కేశవ కోలాట భజన మండలికళాకారుల సాంప్రదాయ నృత్యం, తిరుపతికి చెందిన సదానంద నిలయవాస భజన మండలికి కళాకారులు, తిరుపతికి చెందిన శ్రీ వైభవ వెంకటేశ్వర కోలాటం బృందం కళాకారులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యం, కోలాటాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.