OUR MOTTO IS TO PROVIDE PLEASANT DARSHAN TO COMMON PILGRIMS-TTD CHAIRMAN _ సోమ, మంగళ, బుధవారాల్లో రాత్రి విఐపి బ్రేక్‌ దర్శనం రద్దుకు యోచన: తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు

TIRUPATI, MARCH 31:  TTD Chairman Sri K Bapi Raju asserted that the first and foremost motto of TTD is to provide a hassle-free and pleasant darshan to the tens of thousands of common pilgrims who are visiting the hill shrine of Lord Venkateswara.
 
Addressing media persons at Sri Padmavathi Guest House in Tirupati on Sunday evening, the TTD’s Chairman said, TTD has been constantly exploring ways and means to provide a happy and convenient darshan to every pilgrim who visitng Tirumala not only from various parts of the country but also overseas.
 
“Our Board along with TTD management is effortlessly working day and night to provide a good darshan to the visiting pilgrim. In the wake of heavy summer rush ahead, we are contemplating to cancel VIP evening break darshan on Monday, Tuesday and Wednesday apart from Friday, Saturday and Sunday which is already under practice except for Thursday. We may discuss and resolve on this important issue in the upcoming board meeting in April”, he added.
 
TTD board member Sri Chitturi Ravindra was also present.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సోమ, మంగళ, బుధవారాల్లో రాత్రి విఐపి బ్రేక్‌ దర్శనం రద్దుకు యోచన:  తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు

తిరుపతి, మార్చి 31, 2013: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు వీలుగా సోమ, మంగళ, బుధవారాల్లో రాత్రి విఐపి బ్రేక్‌ దర్శనాన్ని రద్దు చేసేందుకు యోచిస్తున్నట్టు తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథిగృహంలో ఆదివారం సాయంత్రం ఆయన బోర్డు సభ్యులు శ్రీ చిట్టూరి రవీంద్రతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ ప్రస్తుతం వారంలో శుక్ర, శని, ఆదివారాల్లో రాత్రి విఐపి బ్రేక్‌ దర్శనం లేదన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గురువారం మినహా మిగిలిన సోమ, మంగళ, బుధవారాల్లోనూ రాత్రి విఐపి బ్రేక్‌ను రద్దు చేసేందుకు ఆలోచిస్తున్నట్టు తెలిపారు. ఇది అమలైతే గురువారం మినహా వారమంతా రాత్రి విఐపి బ్రేక్‌ దర్శనం ఉండదని వివరించారు. ఉదయం మాత్రం యథావిధిగా బ్రేక్‌ దర్శనం ఉంటుందని తెలిపారు. దీనిపై తితిదే అధికారులు, పాలకమండలి సభ్యులు, భక్తులతో చర్చించామని, మరోమారు చర్చించి వచ్చే పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.