PALLAVOTSAVAM IN TIRUMALA ON JULY 23_ జూలై 23న తిరుమలలో పల్లవోత్సవం
Tirumala, 19 Jul. 18: In view of the birth anniversary of the Mysore Maharaja I, the unique Pallavotsavam ritual will be observed in Tirumala on July 23.
The TTD has been performing Pallavotsavam since several decades in connection with the birth anniversary of the Maharaja I of Mysore Sansthan, who made huge contributions to the Hill Shrine of Lord Venkateswara.
The donations includes huge chunk of Platinum, Gold, Silver and other precious ornaments. Besides some of the vahanams which are used during annual Brahmotsavams of Lord Venkateswara were also donated by his majesty, the Maharaja I of Mysore only.
Even now in Tirumala shrine during Suprabhata Seva Navaneeta Harati is being rendered to the presiding deity on behalf of Mysore Sanathan. The offering of five kilos of ghee to Brahma Deepam and Akhanda Deepam inside sanctum sanctorum of Lord Venkateswara is being donated by Mysore Sansthan even today.
PALLAVOTSAVAM:
After Sahasra Deepalankara Seva, the processional deity of Lord Malayappa Swamy will be taken on a ride to the Mysore Sansthan in Tirumala where the Lord will be accorded religious reception by the representatives of the Karnataka government on Monday.
Later the Lord will be given special harati followed by the distribution of prasadams to pilgrims.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
జూలై 23న తిరుమలలో పల్లవోత్సవం
జూలై 19, తిరుమల 2018: కలియుగ వైకుంఠమైన తిరుమలలో మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని జూలై 23వ తేదీ సోమవారం పల్లవోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేస్తారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పిస్తారు.
మైసూరు మహారాజు జ్ఞాపకార్థం దాదాపు 300 సంవత్సరాల నుండి పల్లవోత్సవాన్ని టిటిడి నిర్వహిస్తుంది. మొదట్లో ఈ ఉత్సవాన్ని తోటోత్సవం అనేవారు. ఈ ఉత్సవంలో కర్ణాటక సత్రాలకు విచ్చేసిన స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపీణి చేస్తారు.
చారిత్రక ప్రాశస్త్యం
శ్రీవారికి పరమ భక్తుడైన మైసూరు మహారాజు అచంచలమైన భక్తి భావంతో భూరి విరాళాలు అందించారు. ఇందులో భాగంగా మూలవిరాట్టుకు, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు, ప్లాటినం, బంగారు, వజ్రలు, కెంపులు, పచ్చలు, మకరం తదితర అముల్యమైన అభరణాలు బహుకరించారు.
అదేవిధంగా బ్రహ్మూత్సవాలలో శ్రీవారికి ఉపయోగించే గరుడ, గజ, ముత్యపుపందిరి, సర్వభూపాల, అశ్వ, సూర్యప్రభ, చంద్ర ప్రభ వాహనాలు అందించారు. స్వామివారి వాహనసేవలలో భాగంగా ఐదవ రోజు ఉదయం పల్లకీ ఉత్సవంలో ఉపయోగించే పల్లకీని ఆయన ప్రత్యేకంగా ఏనుగు దంతాలతో, అద్భుతమైన కళాకృతులతో తయారుచేసి అందించారు.
ప్రతి రోజు తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాతసేవకు ముందు మైసూరు సంస్థానం తరపున నవనీతహారతి, శ్రీవారి ఆలయంలో అఖండ దీపాలైన బ్రహ్మదీపానికి, మహారాజ దీపానికి ప్రతి రోజు 5 కేజిల నెయ్యి ఇచ్చే సాంప్రదాయం ఆయన ప్రారంభించగా, అది నేటికి కొనసాగుతుంది.
మైసూరు మహారాజు జ్ఞాపకార్థం శ్రీవారి ఆలయంలో ప్రతి నెల ఉత్తరాభద్ర నక్షత్రం రోజున రాత్రి 7.30 గంటలకు ప్రత్యేక ఆస్థానం నిర్వహిస్తారు. అదేవిధంగా శ్రీవారికి నిర్వహించే ఉగాది, దీపావళి, ఆణివార ఆస్థానాలలో మైసూరు మహారాజు పేరున ప్రత్యేక హారతి ఉంటుంది. శ్రీకృష్ణ జన్మష్టమి సందర్భంగా నిర్వహించే ఉట్లోత్సవం పర్వదినాన కూడా శ్రీమలయప్పస్వామివారు కర్ణాటక సత్రాలకు విచ్చేసి ఉట్లోత్సవం అనంతరం ఆలయానికి చేరుకుంటారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.