PAVITRA PRATISTA OBSERVED _ వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆల‌యంలో వైభవంగా ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ

Tirupati, 13 Oct. 19: As a part of the ongoing annual Pavitrotsavams at Sri Valmikipuram Pattabhiramalayam temple, Pavitra Pratista was observed on Sunday.

On Monday the three-day fete will conclude with Purnahuti.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

 

వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆల‌యంలో వైభవంగా ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ

తిరుపతి, 2019 అక్టోబరు 13:  వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆల‌యంలో జ‌రుగుతున్న ప‌విత్రోత్స‌వాల్లో భాగంగా ఆదివారం శాస్త్రోక్తంగా ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ చేప‌ట్టారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన నిర్వహించారు. ఆ త‌రువాత‌ యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వ‌హించారు. అనంత‌రం స్వామి, అమ్మ‌వార్ల మూల‌వ‌ర్ల‌కు, ఉత్స‌వ‌ర్ల‌కు, అనుబంధ ఆల‌యాల దేవ‌తామూర్తుల‌కు  ప‌విత్ర స‌వ‌ర్ప‌ణ నిర్వ‌హించారు.  అదేవిధంగా అక్టోబరు 14న ఉదయం యాగశాల పూజ, మహాపూర్ణాహుతి, స్నపన తిరుమంజనం నిర్వ‌హిస్తారు. రాత్రి తిరువీధి ఉత్సవం, పవిత్ర వితరణతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.

గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రం, స్వామివారి తీర్ధ ప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.
       

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ య‌ల‌ప్ప‌,  టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ మోహ‌న్‌రావు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.