PAVITROTSAVAM BEGINS AT THALLAPAKA TEMPLE _ తాళ్లపాక శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం
Tirupati, 11 September 2021: As part of spiritual cleansing exercise after year-long festivities, Pavitrotsavam fete began at the Sri Chinna Keshava temple in Tallapaka at YSR Kadapa District on Saturday.
TTD is organising the three-day-long program to make the temple sin-free as per Agama traditions.
The Pavitra Pratista was performed on the first day with several vaidika rituals like Chatustarchana, Bimbaradhana, Mandalaradhana, Kumbharadana, Pavitra Havanam, Pavitra Homam and sattumora.
Temple AEO Sri Muralidhar, temple inspector Sri D Balaji and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తాళ్లపాక శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2021 సెప్టెంబరు 11: తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు శనివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో భక్తుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
మొదటి రోజు ఉదయం పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు. ఈ సందర్భంగా చతుష్టానార్చన, బింబారాధన, మండలారాధన, కుంబారాధన, కుండలారాధన, పవిత్రహవనం, పవిత్రహోమం, శాత్తుమొర చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ మురళీధర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ డి.బాలాజి తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.