PAVITROTSAVAMS IN TONDAMANPURAM _ ఆగస్టు 17 నుండి 19వ తేదీ వరకు తొండమాన్ పురం శ్రీ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు
TIRUPATI, 10 AUGUST 2024: The annual Pavitrotsavams in Tondamanpuram will be observed from August 17 to 19 with Ankurarpanam on August 16.
On first day Pavitra Pratista, second day Pavitra Samarpana and on the last day Pavitra Purnahuti will be observed.
The Hindu Dharma Prachara Parishad wing of TTD is organising devotional cultural programs during these days.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగస్టు 17 నుండి 19వ తేదీ వరకు తొండమాన్ పురం శ్రీ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు
తిరుపతి, 2024 ఆగస్టు 10: తొండమాన్ పురం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 17 నుండి 19వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 16న సాయంత్రం 6 గంటలకు అంకురార్పరణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి.
ఇందులో భాగంగా ఆగస్టు 17న ఉదయం పవిత్ర ప్రతిష్ఠ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఆగస్టు 18న ఉదయం పవిత్ర సమర్పణ, సాయంత్రం చతుష్టానార్చన నిర్వహిస్తారు. ఆగస్టు 19న ఉదయం మహా పూర్ణాహుతి, పవిత్ర వితరణ, స్నపనతిరుమంజనం, చక్రస్నానంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. అనంతరం సాయంత్రం ప్రాకార ఉత్సవం, ఆస్థానం చేపడతారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.