PERFORM SPIRITUAL PROGRAMMES WITH SOCIAL FACE-CDAC CHAIRMAN _ ప్రతి జిల్లాలో ధార్మిక శిక్షణ కార్యక్రమాలు : కేంద్రీయ ధార్మిక సలహామండలి అధ్యకక్షులు శ్రీ రాంబాబు

TIRUMALA, OCT 4:  In order to take the essence of Hinduism, TTD should take up more and more spiritual activities with the social interface, said Central Dharmic Advisory Council Chairman Sri J Rambabu.
 
Addressing the CDAC meeting held at Annamaiah Bhavan in Tirumala on Thursday, the chairman has suggested the body to take up spiritual activities in a rigorous manner in nook and corner of the State. “We had seen the public response for Managudi programme which was conducted in about 15thousand temples across the state on Shravana Pournami day. The public are ready to participate in the spiritual and dharmic activities. Let us perform the second phase of Managudi on Kartika Paurnami day on November 28 with more spirit”, he added. He asked the officials concerned to give wide publicity to the second phase programme.
 
Similarly let us also perform Kaishika Dwadasi in all the temples located in 1058 mandals across the state on November 25. Also plan a programme to perform Laksha Bilwarchana in all the temples on November 19. TTD should publish small information book lets on all the folk Gods and Goddesses festivals that are being performed across the state, on Hanuman Diksha, Gopuja etc.   Focus should be laid on setting up bhajan mandalis in all dalita wadas.
 
The chairman also instructed the body to have a re-look at the Archaka Sikshana training classes to the people of fishermen community, backward community etc.
 
TTD EO Sri LV Subramanyam, JEO Tirupati Sri Venkatrami Reddy, HDPP Secretary Sri Venkat Reddy, members of the CDAC were also present.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ప్రతి జిల్లాలో ధార్మిక శిక్షణ కార్యక్రమాలు : కేంద్రీయ ధార్మిక సలహామండలి అధ్యకక్షులు శ్రీ రాంబాబు

తిరుపతి, 2012 అక్టోబరు 3: సనాతన హైందవ ధర్మ వ్యాప్తి కోసం విశాలమైన దృక్పథంతో కార్యక్రమాలు రూపొందించా లని, ప్రతి జిల్లాలో ధార్మిక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని కేంద్రీయ ధార్మిక సలహా మండలి అధ్యకక్షులు శ్రీ రాంబాబు తితిదేకి సూచించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం కేంద్రీయ ధార్మిక సలహామండలి సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీ రాంబాబు మాట్లాడుతూ ధర్మప్రచారాన్ని మిళితం చేసి రాష్ట్రవ్యాప్తంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అణగారిన వర్గాలు నివసించే ప్రాంతాల్లో ముఖ్యంగా దళితవాడల్లో భజన మందిరాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామదేవత పూజావిధానాలపై పుస్తకాలు ముద్రించి పంపిణీ చేయాలని కోరారు. తితిదే ప్రస్తుతం చేపడుతున్న అర్చక శిక్షణ విధానాన్ని సమీక్షించాలని సూచించారు.

ఆగస్టు 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మనగుడి కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. నవంబరు 28వ తేదీన కార్తీకపౌర్ణమి సందర్భంగా నిర్వహించనున్న రెండో విడత మనగుడి కార్యక్రమాన్ని భక్తుల భాగస్వామ్యంతో ఏవిధంగా జయప్రదం చేయాలనే విషయాలపై  కూలంకషంగా చర్చించారు. రెండో విడత మనగుడి విజయవంతానికి ప్రణాళికాబద్ధంగా కరపత్రాలు, వాల్‌పోస్టర్లు సిద్ధం చేయాలని కోరారు. ఇందులో భాగంగా గోపూజ, ఆధ్యాత్మిక ప్రవచనాలు, హనుమంత దీక్ష, లక్ష్మీపూజ, కుంకుమార్చనలు, నాగులచవితి రోజు కార్యక్రమాలు రూపొందించాలన్నారు.

అదేవిధంగా నవంబరు 19వ తేదీన ఎంపిక చేసిన ఆలయాల్లో లక్ష్యబిల్వార్చన నిర్వహించాలని శ్రీ రాంబాబు సూచించారు. నవంబరు 25వ తేదీన 1058 మండలాల్లో  కైశికద్వాదశి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భక్తులకు గోవింద నామావళిని పంపిణీ చేయాలని కోరారు. ఇప్పటివరకు జరిగిన సలహామండలి సమావేశాల్లో ఇచ్చిన సూచనలు, సలహాలపై తీసుకున్న చర్యలతో కార్యాచరణ రూపొందించాలని ఆయన కోరారు.

ఈ సమావేశంలో తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం, తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ప్రత్యేకాధికారి శ్రీ ఎస్‌.రఘునాథ్‌, జస్టిస్‌ భాస్కర్‌రావు, శ్రీ వీరభద్రయ్య, శ్రీ పొత్తూరు వేంకటేశ్వరరావు, శ్రీ విఠల్‌రావు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.