PILGRIMS EXPRESS IMMENSE SATISFACTION OVER ARRANGEMENTS_ శ్రీవారి ఆలయ మాడ వీధులు, గ్యాలరీల్లో టిటిడి ఛైర్మన్, ఈవో, జెఈవో విస్తృత తనిఖీలు
Tirumala, 14 October 2018: Pilgrims expressed immense satisfaction over the arrangements of food and water made by TTD for Garuda Seva.
When TTD Trust Board Chairman Sri P Sudhakar Yadav inspected the galleries and interacted with the pilgrims, they lauded the arrangements of TTD and commendable services offered by Srivari Sevakulu.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
శ్రీవారి ఆలయ మాడ వీధులు, గ్యాలరీల్లో టిటిడి ఛైర్మన్, ఈవో, జెఈవో విస్తృత తనిఖీలు
అక్టోబరు 14, తిరుమల 2018: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం గరుడ వాహనసేవను పురస్కరించుకుని శ్రీవారి ఆలయ మాడ వీధులు, గ్యాలరీల్లో భక్తుల ఏర్పాట్లపై టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు వేర్వేరుగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. టిటిడి ఏర్పాట్లు బాగున్నాయంటూ భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.
గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు అందుతున్న అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ, పాలు పంపిణీ, మొబైల్ అంబులెన్స్ ఏర్పాట్లను పరిశీలించారు. పలువురు భక్తులతో మాట్లాడి టిటిడి కల్పించిన సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. గ్యాలరీల్లోని భక్తులకు, మాడ వీధుల బయట గల భక్తులకు, దర్శనం కోసం క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని ఆ విభాగం అధికారులను ఆదేశించారు. గరుడసేవ పూర్తయిన తరువాత కూడా భక్తులందరికీ అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదాలను అందించాలన్నారు. గ్యాలరీల్లోని భక్తులకు బిస్బెల్లా బాత్, టమోటా రైస్, పెరుగన్నం, పులిహోర, ఉప్మా, కాఫి, పాలు, సుండల్ అందిస్తున్నట్టు తెలిపారు. మాడ వీధుల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి పరిశుభ్రంగా ఉంచాలని, గరుడసేవ అనంతరం చెత్తను తరలించాలని అధికారులకు సూచించారు. వాహనసేవను దర్శించుకున్న అనంతరం భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా నిర్దేశిత మార్గాల ద్వారా వెలుపలికి వెళ్లేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్, భద్రతా సిబ్బందికి సూచించారు. కాగా, 2 వేల మంది శ్రీవారి సేవకులు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో భక్తులకు సేవలందిస్తున్నారు. శ్రీవారి సేవకుల సేవలను భక్తులు ప్రశంసించారు.
ఈ తనిఖీల్లో టిటిడి ఇన్‌చార్జి సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్ఇలు శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీ రమేష్‌రెడ్డి, శ్రీ సుధాకరరావు, విఎస్వో శ్రీ రవీంద్రారెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డా..శర్మిష్ట, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.