PILGRIMS GIVE THUMBS UP TO SEATING SYSTEM IN KKC_ నందకం విశ్రాంతి భవనంలోని కల్యాణకట్టను పరిశీలించిన టిటిడి ఛైర్మన్ శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్
Tirumala, 24 July 2018: For the sake of aged and specially able pilgrims, with the intervention of TTD Chairman Sri P Sudhakar Yadav, new seating arrangements have been made on trial basis in Kalyanakatta tonsuring areas in Tirumala.
As a part of it, the Chairman inspected the Kalyanakatta in Nandakam Rest House on Tuesday.
Pilgrims Sri Uma Maheswara Rao from Tenali thanked the innovative move taken by TTD board chief for the sake of pilgrims.
Speaking on the occasion, the Chairman said, following the requests from the pilgrims during is previous inspections who sought him to provide some seating arrangements as many aged could not able to sit on the floor in tonsure centres, we tossed this idea on experimental basis. Now as it has been receiving rave compliments from pilgrims we will enhance this facility”, he added.
SE II Sri Ramachandra Reddy, DyEO(KKC) Smt Nagarathna was also present.
నందకం విశ్రాంతి భవనంలోని కల్యాణకట్టను పరిశీలించిన టిటిడి ఛైర్మన్ శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్
జూలై 24, తిరుమల 2018: తిరుమలలోని నందకం విశ్రాంతి భవనంలోని కల్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పణకు సౌకర్యవంతంగా ఉండేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన కుర్చీలను మంగళవారం టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ వృద్ధులు, దివ్యాంగులు కింద కుర్చుని తలనీలాలు సమర్పించేందుకు ఇబ్బంది పడుతున్నారన్నారు. భక్తులకు సౌకర్యంగా
ఉండేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన కుర్చీల పనితీరును ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడతగా తిరుమలలోని ప్రతి కల్యాణ కట్టలో 5 కుర్చీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అనంతరం ఛైర్మన్ భక్తులకు టిటిడి అందిస్తున్న సౌకర్యాలపై, నూతనంగా ఏర్పాటు చేసిన కుర్చీలో కుర్చుని తలనీలాలు సమర్పిచడంపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. టిటిడి అందిస్తున్న సౌకర్యాలు, నూతనంగా ఏర్పాటు చేసిన కుర్చీలో కుర్చుని తలనీలాలు సమర్పించడంపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌ఇ శ్రీ రామచంద్రారెడ్డి, కల్యాణకట్ట డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఇతర అదికారులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.