POSTERS RELEASED_ తిరుచానూరు శ్రీ సుందరరాజస్వామివారి వార్షిక అవతార మహోత్సవాల గోడపత్రికలు అవిష్కరణ
Tirupati, 18 Jun. 19: The Avatarotsavams of Sri Sundara Raja Swamy at Sri Padmavathi Ammavari temple in Tiruchanoor will be observed from June 23 to 25.
The posters for the same were released by Tirupati JEO Sri B Lakshmikantham at his bungalow in Tirupati on Tuesday evening.
Temple DyEO Smt Jhansirani was also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుచానూరు శ్రీ సుందరరాజస్వామివారి వార్షిక అవతార మహోత్సవాల గోడపత్రికలు అవిష్కరణ
తిరుపతి, 2019 జూన్ 18: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి ఆలయంలో జూన్ 23 నుండి 25వ తేదీ వరకు జరుగనున్న అవతార మహోత్సవాల గోడపత్రికలను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం అవిష్కరించారు. తిరుపతిలోని జెఈవో బంగ్లాలో మంగళవారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ జూన్ 23, 24, 25వ తేదీలలో మధ్యాహ్నం 2.00 నుండి 3.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి ముఖమండపములో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామివారికి వైభవంగా అభిషేకం నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం సాయంత్రం 5.30 నుండి 6.15 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారి ముఖమండపంలో ఊంజల్ సేవ, జరుగుతుందన్నారు.
జూన్ 23వ తేదీ పెద్దశేష వాహనం, 24వ తేదీ హనుమంత వాహనం, జూన్ 25వ తేదీ గరుడ వాహనంపై శ్రీ సుందరరాజస్వామివారు రాత్రి 7.00 గంటల నుండి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.