POSTERS RELEASED_ కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి పవిత్రోత్సవాల గోడ‌ప‌త్రిక‌లు ఆవిష్క‌రించిన తిరుప‌తి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్‌

Tirupati, 16 Aug. 19: The wall posters of annual Pavitrotsavams at Sri Konetiraya Swamy temple at Palamaneru were released by Tirupati JEO Sri P Basant Kumar on Friday in his chambers in TTD Administrative Building.

The annual fete will be observed from August 26 to 28 with Ankurarpanam on August 25.

Temple DyEO Sri Elleppa, Temple Inspector Sri Mohan were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి పవిత్రోత్సవాల గోడ‌ప‌త్రిక‌లు ఆవిష్క‌రించిన తిరుప‌తి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్‌

తిరుపతి, 2019 ఆగస్టు 16: టిటిడి అనుబంధ ఆలయమైన శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో ఆగ‌స్టు 26 నుండి 28వ తేదీ వరకు నిర్వ‌హించ‌నున్న పవిత్రోత్సవాల గోడ‌ప‌త్రిక‌ల‌ను టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ ఆవిష్క‌రించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలో జెఈవో కార్యాల‌యంలో శుక్ర‌వారం ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ ఆగ‌స్టు 25న సాయంత్రం పుణ్యాహవచనం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయ‌న్నారు. ఆగ‌స్టు 26వ తేదీ రక్షబంధనం, పవిత్రప్రతిష్ఠ, శేయాధివాసం, ఆగ‌స్టు 27న ఉదయం స్నపనతిరుమంజనం, పవిత్ర సమర్పణ, సాయంత్రం పవిత్ర హోమం, తిరువీధి ఉత్సవం నిర్వహిస్తార‌న్నారు. ఆగ‌స్టు 28న ఉద‌యం హోమాలు, సాయంత్రం మహాపూర్ణాహుతితో ప‌విత్రోత్స‌వాలు ముగుస్తాయ‌ని తెలిపారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, హరికథ, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించనున్న‌ట్లు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ య‌ల‌ప్ప‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ మోహ‌న్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

ఆల‌య ప్రాశ‌స్త్యం –

చిత్తూరు జిల్లా గంగ‌వ‌రం మండ‌లం, కీల‌ప‌ట్ల గ్రామంలో వెల‌సిన శ్రీ కోనేటిరాయస్వామివారి ఆల‌యం అతి పురాత‌నమైన, చారిత్ర‌క ప్ర‌సిద్ధి క‌లిగిన దేవాల‌యం. భృగుమ‌హ‌ర్షి స్వామివారిని ప్ర‌తిష్ఠించి ఆరాధించ‌గా, ఆర్జునుని మునిమ‌న‌మ‌డు జ‌న‌మేజ‌య మ‌హారాజు గుడి క‌ట్టించారు. చోళ‌, ప‌ల్ల‌వ‌, విజ‌య‌న‌గ‌ర రాజుల ఏలుబ‌డిలో విశేష పూజ‌లు అందుకున్నారు.

అనంత‌రం మ‌హ‌మ్మ‌ధీయుల దండ‌యాత్ర‌ల‌కు భ‌య‌ప‌డి గ్రామ‌స్థులు స్వామివారిని కోనేటిలో దాచి ఉంచినారు. ఆ త‌రువాత కాలంలో చంద్ర‌గిరి సంస్థానాధీసులకు స్వామివారు క‌ల‌లో సాక్షాత్క‌రించ‌గా, కోనేటిలోనున్న స్వామివారిని తిరిగి ప్ర‌తిష్ఠించారు. ఈ విధంగా కోనేటి నుండి ప్ర‌తిష్ఠ చేయ‌బ‌డింది కావున కోనేటి రాయ‌స్వామిగా ప్ర‌సిద్ధి చెందినారు. అన్న‌మ‌య్య కీర్త‌న‌ల‌లోని కోనేటిరాయ‌స్వామి ఆల‌యం ఈ గ్రామంలో మాత్ర‌మే ఉన్న‌ది. త‌రువాత కాలంలో పుంగ‌నూరు జ‌మీందార్లు నిత్య కైంక‌ర్యాల‌కు మాన్య‌ముల‌ను స‌మ‌కూర్చినారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.