POTU WORKERS TRAINING PROGRAM ORGANISED_ టిటిడి పోటు కార్మికులకు ఆహార భద్రతపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ శిక్షణ

Tirupati, 28 December 2018: The potu workers were given training as a part of Food Safety Training and Certification program which is compulsory for Food [Laddu Prasadam] Manufacturers licensed with Food Safety & Standards Authority of India[FSSAI].

The training program was held in SVETA building in Tirupati on Friday wherein around 30 Senior Potu Workers of TTD were trained on Food Safety Supervisor Course.

Dr. Pasupathy, Lead Expert, FSSAI imparted training to TTD Potu Workers while Mr Aditya assisted the lead expert. During the training he explained on the measures to safeguard prasadams, hygiene and advanced manufacturing course.

Dr. Pasupathy complimented the TTD Management which is already a pioneer in ensuing safety and standards in production of Laddu Prasadams in a large scale every day.

Sri K.S.Srinivasa Raju, IAS., JEO., Tirumala, Sri P.Harindranath, DyEO[Temple] and Sri P. Ashok Kumar, Incharge Potu Peishkar, arranged and Co-ordinated the above Training Program.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

టిటిడి పోటు కార్మికులకు ఆహార భద్రతపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ శిక్షణ

తిరుపతి, 2018 డిసెంబర్‌ 28: భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిపుణులు శుక్రవారం తిరుపతిలోని శ్వేత భవనంలో టిటిడి పోటు కార్మికులకు ఆహార భద్రతపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఆదేశాల మేరకు ఫుడ్‌సేఫ్టీ ట్రైనింగ్‌ మరియు సర్టిఫికేషన్‌ కార్యక్రమంలో భాగంగా 30 మంది సీనియర్‌ పోటు కార్మికులకు ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిపుణులు డా|| పసుపతి, శ్రీ ఆదిత్య కలిసి శిక్షణ ఇచ్చారు. టిటిడి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో శ్రీవారి లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తోందని, ఆహార భద్రతా ప్రమాణాలను పాటించడంలో ఇతర ధార్మిక సంస్థలకు ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. అనంతరం ప్రసాదాలను శుచిగా ఉంచేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తయారీలో మెళకువలను తెలియజేశారు.

శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, ఇన్‌చార్జి పోటు పేష్కార్‌ శ్రీ పి.అశోక్‌కుమార్‌ ఈ శిక్షణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.