POURNAMI GARUDA SEVA ON JUNE 17_ జూన్ 17న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

Tirumala, 16 Jun. 19: The TTD plans to grandly conduct the monthly bent of Pournami Garuda Seva in a grand manner on June 17.

Lord Malayappaswamy decked in his best jewellery will ride his favourite vahanam Garuda at night and bless devotees.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 17న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

జూన్ 16, తిరుమల 2019: తిరుమలలో జూన్ 17వ తేదీ సోమ‌వారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7.00 నుంచి 9.00 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.