Press Release on Anivara Asthanam _ జూలై 17వ తేదిన తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఆణివార ఆస్థానం

Tirumala, 6 July 2010: The Annual Anivara Asthanam festival will be celebrated in Srivari Temple, Tirumala on July 17th.  In view of the above festival arjitha sevas such as Thomala, Archana, Kalyanotsavam, Unjal Seva, Brahmotsavam, Vasanthotsavam and Sahasra Deepalankara Sevas are cancelled.

Pushpa Pallaki will also be conducted in four Mada streets of Tirumala on the evening of July 17th.  The intended grihasthas may participate in the Pushpa Pallaki by paying Rs.1000/- in favour of the Executive Officer, TTD, Tirumala.

జూలై 17వ తేదిన తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఆణివార ఆస్థానం

తిరుమల, 2010 జూలై 05: తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదిన ఆణివార ఆస్థానం జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీవారికి నిత్యం నిర్వహించే ఆర్జితసేవలైన తోమాల,అర్చన, కల్యాణోత్సవం, ఊంజల సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేస్తారు.

ఆణివార ఆస్థానం రోజు పుష్పపల్లకీ ఉత్సవం నిర్వహిస్తారు. ఈఉత్సవంలో పాల్గొనదలచిన వారు రూ.1000 చెల్లించి పాల్గొనవచ్చును.

ప్రతి సంవత్సరం దక్షిణాయన పుణ్యకాలం, కర్కాటక సంక్రాంతి రోజున శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం అనే ఉత్సవం నిర్వహించడం ఆనవాయితి. పూర్వం దేవస్థానం వారు ఆదాయవ్యయాలు, నిలువలు, మున్నగు సంవత్సర లెక్కలు ఈ ఆణివార ఆస్థానం రోజున ప్రారంభమయ్యేవి.

ఆ రోజు ఆలయంలోని బంగారు వాకిలి ముందు సర్వభూపాల వాహనంలో శ్రీదేవి, భూదేవులతో శ్రీమలయప్పస్వామి వారిని వేంచేపు చేస్తారు. మరొక పల్లకిపై విష్వక్సేనులవారిని వేంచేపు చేసిన పిదప ఘనంగా వస్త్రసమర్పణ, నివేదనలు జరుగుతాయి.

అనంతరం అక్షతారోపణ జరిగిన తర్వాత కార్యనిర్వహణాధికారికి దేవస్థానం బీగాలగుత్తిని తగిలించి హారతి, శఠారులను ఇస్తారు. ఆ తర్వాత ప్రసాద వితరణ జరుగుతుంది.

బంగారు వాకిలి ముందు జరిగే ఆణివార ఆస్థానంలో అర్చకులు, జియ్యంగార్లు, అధికారులు, దేవస్థానం ఉద్యోగులు మాత్రమే పాల్గొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.