PULSE POLIO PROGRAM AT TIRUMALA FROM JAN 31 – FEB 2 _ జనవరి 31 నుండి ఫిబ్ర‌వ‌రి 2వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల‌లో పల్స్‌పోలియో

Tirumala, 29 Jan. 21: TTD is organising a three day pulse polio program at Tirumala from January 31 to February 2 for benefit of locals and also visiting devotees.

The TTD Chief Medical Officer Dr AB Narmada said the medical staff besides NCC cadets are ready with all arrangements to serve polio drops to children below five years.

She said TTD has set up 25 polio camps from 6am to 6pm including one at Srivari temple, 20 at various locations and 4 exclusively for locals.

To spread awareness on the pulse polio program among devotees and locals TTD will organise a rally with the students of SV High School and SV Primary School on Saturday at 10 am.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జనవరి 31 నుండి ఫిబ్ర‌వ‌రి 2వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల‌లో పల్స్‌పోలియో

 తిరుమ‌ల‌, 2021 జ‌న‌వ‌రి 29: శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు, స్థానికుల సౌకర్యార్థం టిటిడి ఆధ్వర్యంలో తిరుమలలో జ‌న‌వ‌రి 31 నుండి ఫిబ్ర‌వ‌రి 2వ తేదీ వ‌ర‌కు మూడు రోజుల పాటు పల్స్‌పోలియో కార్యక్రమం జరుగనుంది.

ఇందుకోసం టిటిడి వైద్య విభాగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ముఖ్య వైద్యాధికారి డాక్ట‌ర్ ఎబి.న‌ర్మ‌ద తెలిపారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు తప్పక పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఇందుకోసం వైద్యసిబ్బంది, ఎన్‌సిసి క్యాడెట్లు, ఇతర సిబ్బంది సేవలందిస్తారని తెలిపారు.  

ఈ మూడు రోజుల్లో ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు శిబిరాల్లో పోలియో చుక్కలు వేస్తారు. తిరుమలలో శ్రీవారి ఆలయంలో 1, భక్తుల కోసం వివిధ ప్రాంతాల్లో 20, స్థానికుల కోసం 4 కలిపి మొత్తం 25 శిబిరాలను ఏర్పాటుచేశారు. ఈ కార్య‌క్ర‌మంపై తిరుమ‌ల‌లోని భ‌క్తుల‌కు, స్థానికుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు జ‌న‌వ‌రి 30వ తేదీ శ‌నివారం ఉద‌యం 10 గంట‌ల‌కు ఎస్వీ హైస్కూల్, ఎస్వీ ప్రాథ‌మిక పాఠ‌శాల విద్యార్థుల‌తో ర్యాలీ నిర్వ‌హిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.