PURANDHARA DASA ARADHANA MAHOTSAVAMS COMMENCES _ అన్న‌మాచార్య క‌ళామందిరంలో శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు

Tirupati, 10 Feb. 21: The Aradhana Mahotsavams of Saint Poet of Kannada Sahitya Sri Purandharadasa Commenced at Annamacharya Kalamandiram in Tirupati on Wednesday.

Nearly 400 Dasas participated in the programme and rendered various Dasa Padagalu.

On Thursday, floral tributes will be paid to the statue of Sri Purandharadasa at Alipiri by 6am.

Dasa Sahitya Project Special Officer Sri PR Anandatheerthacharya is supervising the event arrangements both in Tirupati and at Tirumala.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అన్న‌మాచార్య క‌ళామందిరంలో శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు

తిరుపతి, 2021 ఫిబ్ర‌వ‌రి 10: టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత పితామహులు శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు బుధ‌వారం తిరుప‌తిలోని అన్న‌మాచార్య క‌ళామందిరంలో ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి.

ఈ సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల నుండి విచ్చేసిన 400 మందికిపైగా భ‌జ‌న మండ‌ళ్ల క‌ళాకారులు శ్రీ పురంద‌రదాస కీర్త‌న‌ల‌ను చ‌క్క‌గా ఆల‌పించారు. ఉద‌యం 10 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు బృందాల వారీగా క‌ళాకారులు దాస ప‌దాల‌ను గానం చేశారు. దాససాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనంద‌తీర్థాచార్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఫిబ్ర‌వ‌రి 11న అలిపిరిలో పుష్పాంజ‌లి

ఆరాధ‌నోత్స‌వాల్లో భాగంగా ఫిబ్ర‌వ‌రి 11న గురు‌వారం ఉదయం 6 గంటలకు అలిపిరి వ‌ద్ద‌గ‌ల శ్రీ పురందరదాసుల విగ్రహానికి పుష్పమాల సమర్పిస్తారు. అన్న‌మాచార్య క‌ళామందిరంలో ఉద‌యం 8 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు హ‌రిదాస‌రంజ‌ని క‌ళాకారుల‌తో సంగీత కార్య‌క్ర‌మం, పండితుల ధార్మికోప‌న్యాసాలు, పురంద‌ర‌దాస సంకీర్త‌న విభావ‌రి త‌దిత‌ర కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.