PURANDHARA DASA ARADHANA MAHOTSAVAMS FROM JAN 31 TO FEB 2 _ జ‌న‌వరి 31 నుండి ఫిబ్ర‌వ‌రి 2వ తేదీ వరకు శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు

Tirupati, 29 Jan. 22:  The annual Aradhana Mahotsavams of Karnataka Sangeeta Pitamaha Sri Purandhara Dasa will be observed by the Dasa Sahitya Project of TTD from January 31 to February 2 in Tirupati and at Tirumala.

 

On January 31, there will be the Haridasa Ranjani programme at Annamacharya Kalamandiram in Tirupati between 6pm and 8pm where Dasa Bhajans followed by religious discourses will be performed.

 

Similarly, there will be special programmes at Asthana Mandapam in Tirumala on January 31 which includes Dhyanam, Nagara Sankeertanam, Samuhika Bhajana, discourses by various pontiffs.

 

On the second day on February 1, after garlanding the statue of Sri Purandhara Dasa at Alipiri, Purandhara Dasa Brunda Ganam will be observed at 6pm in Vaibhavotsava Mandapam in the divine presence of Sri Malayappa Swamy, Sridevi and Bhudevi. Usually, this fete takes place in Narayanagiri Gardens. But due to Covid restrictions this year, the venue has been changed.

 

On the last day on February 2, there will be conclusion programmes at Asthana Mandapam in Tirumala. Dasa Sahitya Project Special Officer Sri PR Anandatheerthacharyulu is supervising the arrangements.

 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

జ‌న‌వరి 31 నుండి ఫిబ్ర‌వ‌రి 2వ తేదీ వరకు శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు

తిరుమల, 2022 జ‌న‌వ‌రి 29: కర్ణాటక సంగీత పితామహులు శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు టిటిడి దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో జ‌న‌వరి 31 నుంచి ఫిబ్ర‌వ‌రి 2వ తేదీ వరకు
తిరుప‌తి, తిరుమలలో ఘ‌నంగా జరుగనున్నాయి. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు ఈ కార్యక్రమాల ఏర్పాట్ల‌ను పర్యవేక్షిస్తున్నారు.

మొదటిరోజైన జ‌న‌వరి 31న సోమ‌వారం తిరుప‌తిలోని అన్న‌మాచార్య క‌ళామందిరంలో సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు హరిదాస రంజ‌ని పేరుతో క‌ళాకారుల‌తో భ‌జ‌న‌ సంగీత కార్య‌క్రమం, పండితుల‌తో ధార్మికోప‌న్యాసాలు జ‌రుగుతాయి.

అదేవిధంగా, తిరుమల ఆస్థాన మండ‌పంలో జ‌న‌వరి 31న సోమ‌వారం ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగరసంకీర్తన కార్యక్రమాలు, పురంద‌ర సంకీర్త‌న‌మాల‌, వివిధ పీఠాధిపతుల మంగళాశాసనాలు త‌దిత‌ర‌ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

రెండవ రోజైన ఫిబ్ర‌వ‌రి 1న మంగ‌ళ‌వారం ఉదయం 6 గంటలకు అలిపిరి చెంత పురందరదాసుల విగ్రహానికి పుష్పమాల సమర్పిస్తారు. సాయంత్రం 6 గంటలకు శ్రీవారి ఆలయం వ‌ద్ద‌గ‌ల వైభ‌వోత్స‌వ మండ‌పానికి శ్రీవారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ఆరాధనా మహోత్సవాల్లో భాగంగా శ్రీ పురంద‌ర‌దాస సంకీర్తనల బృంద‌గానం నిర్వ‌హిస్తారు.

చివరిరోజు ఫిబ్ర‌వ‌రి 2న బుధ‌వారం ఉదయం 6 నుండి 9 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల ఆస్థాన‌మండ‌పంలో సుప్ర‌భాతం, ధ్యానం, సామూహిక భ‌జ‌న‌, న‌గ‌ర సంకీర్త‌న కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.