PURANDHARA DASA ARADHANA MAHOTSAVAMS IN TIRUMALA FROM FEB 10-12 _ ఫిబ్ర‌‌వ‌రి 10 నుండి 12వ తేదీ వ‌ర‌కు తిరుమలలో శ్రీ పురందరదాస‌ ఆరాధనా మహోత్సవాలు

Tirumala, 08 February 2021: The Aradhana Mahotsavams of Karnataka Sangeeta Pitamaha Sri Purandhara Dasa will be observed from February 10-12 at Tirumala.

Born in 1480 in Karnataka, Sri Srinivasa Nayaka turned into Purandara Dasa later and penned nearly 4.75lakh Sankeertans in his 84years of lifespan and breathed his last in 1564.

Like Telugu Pada Pitamaha Sri Tallapaka Annamacharya, Sri Purandhara Dasa also did a great service to Lord Venkateswara through his impeccable Sankeertans. As a tribute to this great Saint Poet of Kannada, TTD has been observing Sri Purandhara Dasa Aradhana Mahotsavams every year since the inception of Dasa Sahitya Project in 1979. The visit of Sri Malayappa Swamy along with His two Consorts, Sridevi and Bhudevi to Narayanagiri Gardens on the occasion of Purandhara Dasa Aradhana Mahotsavams commenced in the year from 2006 onwards by TTD.

During this three day programme, Sri Vidyasreesha Theertha Swamy of Vyasaraja Mutt, Sri Sugunendra Theertha Swamy of Puttige Mutt, Sri Vidhadheesha Theertha Swamy of Palimaru Mutt, Sri Vidyaprasanna Theertha Swamy of Kukke Subrahmanyam will render Anugraha Bhashanam at Asthana Mandapam on February 10 and 11 between 9:30am and 12noon. The top brass officials of TTD will also take part in this programme.

On February 11, there will be Unjal Seva to the processional deities in Narayanagiri Gardens at 6pm. Suprabhatam, Dhyanam, Community Bhajan, Nagara Sankeertana will also be conducted during these days.

The three-day Aradhana Mahotsavam programme will conclude with Haridasa Rasa Ranjani with Dasa artistes on February 12 at Tirumala.

Dasa Sahitya Project Special Officer Sri P R Ananda Theertha Acharya is supervising the arrangements for this event.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఫిబ్ర‌‌వ‌రి 10 నుండి 12వ తేదీ వ‌ర‌కు తిరుమలలో శ్రీ పురందరదాస‌ ఆరాధనా మహోత్సవాలు

తిరుమల, 2021 ఫిబ్ర‌వ‌రి 08: కర్ణాటక సంగీత పితామహుడు శ్రీ పురందరదాస‌ ఆరాధనా మహోత్సవాలు ఫిబ్ర‌‌వ‌రి 10 నుండి 12వ తేదీ వ‌రకు తిరుమలలోని ఆస్థాన మండ‌పంలో ఘ‌నంగా జ‌రుగ‌నుంది.

ఇందులో భాగంగా ప్ర‌తి రోజు ఉద‌యం 5.30 నుండి 7 గంట‌ల వ‌ర‌కు సుప్రభాతం, ధ్యానం, స‌మూహిక భజన‌లు, నగర సంకీర్తన నిర్వహించనున్నారు. ఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు దాస సాహిత్య ప్రాజెక్టు క‌ళాకారుల‌తో శ్రీ పురంద‌ర దాస సంకీర్త‌న‌మాల జ‌రుగ‌నుంది.

 అనంత‌రం ఉదయం 9:30 మరియు మధ్యాహ్నం 12 గంటల వ‌ర‌కు బెంగుళూరుకు  చెందిన వ్యాసరాజ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీషతీర్థుల స్వామీజీ, ఉడిపికి చెందిన పుత్తిగే మఠాధిపతి శ్రీ‌శ్రీ‌శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ, పా‌లిమారు మఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విద్యాధీశ తీర్థ స్వామీజీ, కుక్కె సుబ్ర‌హ్మ‌ణ్యంస్వామి మ‌ఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ‌ విద్యాప్రసన్న తీర్థ స్వామీజీలు మంగ‌ళ శాస‌న‌ములు అందించ‌నున్నారు.

కాగా, ఫిబ్రవరి 11 న సాయంత్రం 6 గంటలకు సాయంత్రం స‌హ‌స్ర దీపాలంకార సేవ అనంత‌రం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు ఊరేగింపుగా నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల‌కు వేంచేపు చేస్తారు. అక్క‌డున్న శ్రీ ప‌ద్మావ‌తి ప‌రిణ‌య మండ‌పంలో  శ్రీ పురందరదాస‌ ఆరాధనా మహోత్సవం నిర్వ‌హిస్తారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ క‌ళాకారులు శ్రీ పురంద‌ర‌దాస కీర్త‌న‌ల‌ను బృంద‌గానం చేస్తారు.

 1480వ సంవ‌త్స‌వం కర్ణాటకలో జన్మించిన శ్రీ శ్రీనివాస నాయక తరువాత పురంధర దాస‌గా మారి తన 84 సంవత్సరాల జీవితకాలంలో దాదాపు 4.75 ల‌క్ష‌ల‌ సంకీర్త‌న‌ల‌ను రాశారు. 1564 లో శ్రీ‌వారిలో ఐక్య‌మైనారు.

తెలుగు ప‌ద పితామహుడైన‌ శ్రీ తాళ్ల‌పాక అన్నమాచార్యులు మాదిరిగానే, శ్రీ పురంధర దాస కూడా తన సంకీర్తనాల ద్వారా శ్రీ వేంక‌టేశ్వరుడికి విశేష‌ సేవ చేసారు. టిటిడి 1979 లో దాసా సాహిత్య ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసింది. అప్ప‌టి నుండి ప్రతి సంవత్సరం శ్రీ పురంధర దాస ఆరాధన మహోత్సవాలను నిర్వ‌హిస్తున్న‌ది. తిరుమ‌ల‌లో 2006వ సంవ‌త్స‌రం నుండి శ్రీ పురందరదాస‌ ఆరాధనా మహోత్సవాలను పుర‌స్క‌రించుకొని టిటిడి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్ప స్వామివారిని నారాయణగిరి ఉద్యాన‌వ‌నాల‌కు వేంచేపు చేయ‌డం ఆనవాయితీగా వస్తోంది.

దాస‌ సాహిత్య ప్రాజెక్ట్ ప్ర‌త్యేకాధికారి శ్రీ పి ఆర్ ఆనంద తీర్థచార్యులు ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
          
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.