PUSHPAYAGAM IN NAGALAPURAM _ మే 21న శ్రీ వేద నారాయణ స్వామివారి ఆలయంలో పుష్పయాగం
TIRUPATI, 19 MAY 2022: The annual Pushpayagam will be observed in Sri Vedanarayana Swamy temple at Nagalapuram on May 21. In connection with this fete, the Ankurarpanam will be observed on May 20 between 6.15pm and 7.45pm.
On May 21, Snapana Tirumanjanam to the Utsavarulu will be performed between 9.30am and11am followed by Pushpayagam between 3pm and 5.30pm with varieties of traditional and ornamental flowers. Grihastas on payment of Rs.750 per ticket (two persons) shall take part in this celestial fete. Later in the night Veedhi Utsavam will be observed between 7pm and 8.30pm.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
మే 21న శ్రీ వేద నారాయణ స్వామివారి ఆలయంలో పుష్పయాగం
తిరుపతి, 2022 మే 19: నాగలాపురం శ్రీ వేద నారాయణ స్వామివారి ఆలయంలో మే 21వ తేదీన పుష్పయాగ మహోత్సవం జరుగనుంది. ఇందుకోసం మే 20న సాయంత్రం 6.15 నుండి రాత్రి 7.45 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్రాహణం, సేనాధిపతి ఉత్సవం, పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహిస్తారు.
మే 21న ఉదయం 11 గంటలకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలు, పత్రాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. అనంతరం రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వీధి ఉత్సవం జరుగనుంది. గృహస్తులు (ఇద్దరు) రూ.750/- టికెట్ కొనుగోలుచేసి పుష్పయాగంలో పాల్గొనవచ్చు.
ఈ ఆలయంలో ఏప్రిల్ 16 నుండి 24వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.