RAMANUJACHARYA AVATAR MAHOTSAVAM _ మే 3 నుంచి 5వ తేదీ వరకు భగవద్‌ రామానుజాచార్యుల 1006వ అవతార మహోత్సవాలు

Tirupati, 02 May 2022: The 1006 Avatara Mahotsavam of Sri Ramanujacharya will be observed in annamacharya kalamandiram at Tirupati from May 3-5 under the aegis of Alwar Divya prabandha project of TTD.

 

Everyday there will be literary and cultural devotional programs between 6pm and 8.30pm.

 

Sri Pedda Jeeyar and Sri Chinna Jeeyar of Tirumala render anugraha bhashanam on the occasion.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

మే 3 నుంచి 5వ తేదీ వరకు భగవద్‌ రామానుజాచార్యుల 1006వ అవతార మహోత్సవాలు

తిరుపతి, 2022 మే 02: టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మే 3 నుంచి 5 వ తేదీ వరకు శ్రీ రామానుజాచార్యుల 1006వ అవతార మహోత్సవాలు జరగనున్నాయి.

ఈ సంద‌ర్బంగా మూడు రోజుల పాటు సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు భగవద్‌ రామానుజాచార్యులపై సాహితీ స‌ద‌స్సు, సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.

మే 3వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు టీటీడీ శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామివారి అనుగ్రహభాషణంతో అవతార మహోత్సవాలు ప్రారంభం అవుతాయి. అనంతరం తిరుప‌తికి చెందిన ఆచార్య చ‌క్ర‌వ‌ర్తి రంగనాథన్‌ శ్రీ రామానుజ వైభవంపై ఉపన్యాసిస్తారు. త‌రువాత తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి రేవ‌తి బృందం చే భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.