Release of S.V. Vedic University Degree & PG Results _ వేదవిశ్వవిద్యాలయం డిగ్రీ, పిజీ పరీక్షా ఫలితాలు విడుదల చేసిన టిటిడి ఛైర్మ‌న్‌

Tirumala, 3 July 2010: Sri D.K. Adhikesavulu Chairman TTDs has released the CD’s regarding the results of S.V. Vedic University, Tirupati, for Sastri (BA), Acharya (MA), Veda, Agama, Pourahithya, Mimamsa, Kalpa, Vedabhasyam at Ranganayakula Mandapam inside Srivari Temple, Tirumala on Saturday morning.

Speaking on this occasion, the chairman has appreciated the Vedic University officials for the steps taken for the improvement of Vedasahitya so for the TTD has started 3 (Three) Vedapatasala’s in the state, and planning to start some more in the state he added.

Out of 150 students, 135 students have passed in the courses like Krishna, Sukla, sama, Adharva, Rugveda, Viakhanasa, Pancharathra,  Saivagama, Apasthamba, Paraskara, Aswivayana, Pourohithyam, Vedabhashyam, Kalpam, Mimamsa and etc., subjects.

Sri Sannidhanam Sudharsana Sharma Vice-Chancellor and Sri Vishnubhattacharyulu Dean have participated in this programme.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వేదవిశ్వవిద్యాలయం డిగ్రీ, పిజీ పరీక్షా ఫలితాలు విడుదల చేసిన టిటిడి ఛైర్మ‌న్‌

తిరుమల, 2010 జూలై 03: శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం 2010 ఏఫ్రిల్‌ నెలలో నిర్వహించిన శాస్త్రి (బి.ఎ) ఆచార్య (ఎం.ఎ) వేద-ఆగమ- పౌరోహిత్య- మీమాంసా- కల్ప- వేదభాష్యాలకు చెందిన ఫలితాంశాలను శనివారం తితిదే పాలకమండమలి అధ్యకక్షులు డి.కె. ఆదికేశవులు తిరుమల శ్రీవారి ఆలయంలోని  రంగనాయకమండపంలో విడుదల చేసారు.

ఈ సందర్భంగా అధ్యకక్షుల వారు మాట్లాడుతూ వేదవిశ్వవిద్యాలయాన్ని అభినందిస్తూ వేథాస్త్ర సంరక్షణ కోసం తితిదే నడుంబిగించినదని, ఇప్పటికే రాష్ట్రంలో 3 చోట్ల వేదపాఠశాలలను స్థాపించిందని మరొక రెండు ప్రదేశాలలో స్థాపించి వేద శాస్త్రాలను పటిష్ఠం చేయటానికి ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు.

వేద ఆగమ విద్యార్థులకు పారితోషికం భారీగా పెంచి ప్రోత్సహిస్తున్నదని, మన రాష్ట్రంలోనే కాక దేశవిదేశాలలో ఉన్న వేద విద్వాంసుల పరిరక్షణ, శాస్త్ర సంరక్షణ తితిదే కర్తవ్యం అని తెలిపారు.

తితిదే ప్రధాన లక్ష్యం వేదములు, ఆగమములు శాస్త్రములను రక్షించటమే అని వివరించారు.

కృష్ణ-శుక్ల-సామ-అధర్వ-ఋగ్వేదములు వైఖానస- పాంచరాత్ర- శైవాగమములు, ఆపస్తంబ- పారస్కర- ఆశ్వీవాయన – పౌరోహిత్యములు – వేదభ్యాష్యములు, కల్పం, మీమాంసా శాస్త్రముల విభాగములకు చెందిన విద్యార్థులు 150 మంది పరీక్షలు వ్రాయగా 135 మంది ఉత్తీర్ణులైౖనట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వేదవిశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య సన్నిధానం సుదర్శనశర్మ, వైఖానాస ఆగమ డీన్‌ ప్రొఫెసర్‌ వేదాన్తం శ్రీవిష్ణుభట్టాచార్యులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.