REPUTATION OF TTD DEPENDS ON YOUR SERVICES-EO TO VIGILANCE SLEUTHS AND VOLUNTEERS_ పోలీసుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని భ‌క్తుల‌కు మెరుగైన భ‌ద్ర‌త క‌ల్పిస్తాం  రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌కు ప‌టిష్ట ఏర్పాట్లు: టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

Tirumala, 29 Sep. 19: TTD EO Sri Anil Kumar Singhal called on the vigilance sleuths, srivari seva volunteers, scouts and guides to rededicate themselves in the service of multitude of pilgrims who take part during the mega religious event.

Addressing a huge gathering of TTD Vigilance cops, volunteers and scouts who are deployed for Brahmotsavams which are going to commrnce from September 30 onwards, the EO said everyday is a testing day in Tirumala as the hill town grabs attention across the globe due its popularity.

“The reputation and image of the institution is dependent on your services. So not only Brahmotsavams or Vaikuntha Ekadasi, but everyday is a testing day for all of us. You all have been rendering impeccable services day and night keeping aside your families. I urge you all to be more attentive while diacharging duties as even a small issue become viral because of social media”,  he cautioned.

Earlier Additional EO Sri AV Dharma Reddy said, that this year Garuda Seva will have more turn out of pilgrim crowd compared to previous year since the immediate day is third week of Puratasi Saturday which is very auspicious to Tamil devotees. “So, there is no scope for us breath fresh even after the completion of Garuda Seva as the real challenge continues next day too “,  he said.

TTD CVSO Sri Gopinath Jatti sought the vigilance and volunteers to avoid using mobile phones when on duty as it may deviate them from discharging their services with responsibility.

Later EO and Additional EO released a book on Brahmotsavam Bundobust Scheme designed by TTD Vigilance department.

Additional CVSO Sri TV Siva Kumar Reddy, VGOs Sri Manohar, Sri Prabhakar, all sector AVSOs, VIs and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

పోలీసుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని భ‌క్తుల‌కు మెరుగైన భ‌ద్ర‌త క‌ల్పిస్తాం  రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌కు ప‌టిష్ట ఏర్పాట్లు: టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

తిరుమ‌ల‌, 2019 సెప్టెంబ‌రు 29:   శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసే భ‌క్తుల‌కు మెరుగైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని, ఇందుకోసం పోలీసుల‌తో స‌మ‌న్వయం చేసుకుంటామ‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమ‌ల‌లోని ఆస్థాన‌మండ‌పంలో ఆదివారం సాయంత్రం టిటిడి నిఘా మ‌రియు భ‌ద్ర‌తా సిబ్బంది, ఎస్‌సిసి క్యాడెట్లు, స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ భ‌ద్ర‌తా సిబ్బంది త‌మ‌కు కేటాయించిన ప్రాంతంలో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విధులు నిర్వ‌హించి భ‌క్తుల‌కు సేవ‌లందించాల‌ని కోరారు. ఏవైనా స‌మ‌స్య‌ల‌ను గుర్తిస్తే వెంట‌నే పై అధికారుల‌కు స‌మాచారం అందించాల‌ని సూచించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్ జెట్టి, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, విఎస్‌వో శ్రీ మ‌నోహ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌కు ప‌టిష్ట ఏర్పాట్లు

బ్ర‌హ్మోత్స‌వాల మొద‌టి రోజు రాష్ట్ర ముఖ్య‌మంత్రి గౌ.శ్రీ‌.వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున తిరుమ‌ల శ్రీ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌ని, ఇందుకోసం ప‌టిష్ట ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని ఈవో తెలిపారు. మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు గౌ. ముఖ్య‌మంత్రివ‌ర్యులు రేణిగుంట విమానాశ్ర‌యానికి చేరుకుంటార‌ని, అక్క‌డినుండి తిరుచానూరుకు చేరుకుని ప‌ద్మావ‌తి నిల‌యం యాత్రికుల వ‌స‌తి స‌ముదాయాన్ని ప్రారంభిస్తారని వివ‌రించారు. ఆ త‌రువాత శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ద‌ర్శించుకుంటారని చెప్పారు. అనంత‌రం నాలుగు వ‌రుస‌లుగా అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించిన అలిపిరి – చెర్లోప‌ల్లి రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేస్తారని తెలిపారు.

తిరుమ‌ల‌లో సాయంత్రం 5.20 గంట‌ల‌కు మాతృశ్రీ వ‌కుళాదేవి విశ్రాంతి గృహాన్నిగౌ. ముఖ్య‌మంత్రివ‌ర్యులు ప్రారంభిస్తారని ఈవో తెలిపారు. ఆ త‌రువాత తిరుమలలోని గోవర్థన్ చౌల్ట్రీ పక్కన అదనపు యాత్రికుల వసతి సముదాయం పనులను ప్రారంభిస్తారన్నారు. అక్క‌డి నుండి శ్రీ‌ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహానికి చేరుకుని సాయంత్రం 6.55 గంట‌ల‌కు శ్రీ బేడి ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యానికి చేరుకుంటారని, అక్క‌డినుండి ప‌ట్టువ‌స్త్రాల‌ను ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యానికి తీసుకెళ్లి స‌మ‌ర్పిస్తారని తెలియ‌జేశారు. ఆ త‌రువాత రాత్రి 8 గంట‌ల‌కు పెద్ద‌శేష వాహ‌న‌సేవ‌లో గౌ. ముఖ్య‌మంత్రివ‌ర్యులు పాల్గొంటార‌ని తెలిపారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.