REVIEW MEETING HELD ON KALYANAMASTU ARRANGEMENTS _ కళ్యాణమస్తు విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం సహకారం తీసుకోవాలి : జెఈవో శ్రీ వీరబ్రహ్మం

TIRUPATI, 20 JUNE 2022: TTD JEO Sri Veerabrahmam held a review meeting on the ongoing arrangements for the prestigious noble Kalyanamastu-Free mass marriages event scheduled to take place across all district Head Quarters in AP on August 7.

The meeting was held in the Conference Hall in Administrative Building in Tirupati on Monday evening.

Directing the officials concerned the JEO said to co-ordinate with the respective district authorities to take forward the publicity on the programme even to grass root levels.

He also instructed to involve local Public Representatives, Srivari Sevakulu, Dharma Prachara and Dasa mandalis in the activities.

All the Kalyana Mandapams should be readied for a mega mass event and also asked to list out the requirement of articles from TTD side and from district administration for Kalyanamastu, he maintained.

He wished that both TTD and district officials should make coordinated arrangements to ensure grand success of Kalynamastu free mass marriage programme.

CE Sri Nageswara Rao, Chief Audit Officer Sri Sesha Sailendra, Additional FACAO Sri Ravi Prasadu, VGO Sri Manohar, Deputy EOs, TTD Nodal Officers who are deputed to each district of Andhra Pradesh were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

కళ్యాణమస్తు విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం సహకారం తీసుకోవాలి : జెఈవో శ్రీ వీరబ్రహ్మం

తిరుపతి, 2022 జూన్ 20: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 7వ తేదీ టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న కల్యాణమస్తు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆయా జిల్లా ఉన్నత అధికారులతో సమన్వయం చేసుకుని విజయవంతం చేయాలని జెఈవో శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశమందిరంలో సోమవారం జెఈవో కళ్యాణమస్తు నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో టీటీడీ ఉచిత సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకుగాను ప్రజాప్రతినిధులు, శ్రీవారి సేవకులు, దాససాహిత్య ప్రాజెక్టు కళాకారులు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ భజన మండళ్లు, స్వచ్ఛంద సేవా సంస్థలతో సమన్వయం చేసుకోవాలన్నారు. అన్ని జిల్లాల ప్రజాసంబంధాల అధికారులతో కలిసి కళ్యాణమస్తు పై విరివిగా ప్రచారం చేయాలని సూచించారు. జిల్లా యంత్రాంగం సహకారం తీసుకుని జిల్లా, మండల, గ్రామ స్థాయిలో కళ్యాణమస్తు పై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

అందుబాటులో ఉన్న టీటీడీ కళ్యాణ మండపాలను కళ్యాణమస్తుకు అన్ని విధాలా సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా ఉన్నతాధికారులను కలిసి టీటీడీ కళ్యాణమస్తు కి ఇచ్చే సామాగ్రిని వివరించి, స్థానికంగా సమకూర్చుకోవలసిన ఇతర సామగ్రిని గురించి వివరించాలన్నారు.

ఈ సమావేశంలో సిఇ శ్రీ నాగేశ్వరరావు, సీఏవో శ్రీ శేష శైలేంద్ర, అదనపు ఎఫ్ఎ సీఏవో శ్రీ రవి ప్రసాదు, విజివో శ్రీ మనోహర్, గోసంరక్షణ శాల సంచాలకులు శ్రీ హరినాథ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాలకు డిప్యుటేషన్ పై నియమింపబడిన టీటీడీ నోడల్ అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.