REVIEW MEETING HELD WITH RETIRED TTD OFFICIALS _ పిడ‌బ్ల్యుఎఫ్ఎస్ సేవ‌పై టిటిడి అద‌న‌పు ఈవో స‌మీక్ష‌

Tirumala, 29 Nov. 19: The Additional EO Sri AV Dharma Reddy on Friday held a review meeting with retired TTD officials who aspired to render services in Pilgrim Welfare Facilitation Service.

The meeting was held at Annamaiah Bhavan. The Addnl.EO said the chief motto of this service to liaison between pilgrims and TTD. “You will be assisting the DyEO and AEOs at Vaikuntham Compartments, Temple, Reception and Laddu Counters wherever we require your services and maintain in the smooth flow of pilgrim queue lines. At present we have engaged the Srivari Seva volunteers for PWFS. But since there is a poor attendance of Gazetted rank officers turning up for this service, the Executive Officer Sri Anil Kumar Singhal has thought of deploying our own retired employees who are willing to offer their services”, he maintained.

Adding further he said, there will be no remuneration paid to the retired TTD employees who will taking part in PWFS and they also have to render free services akin to PWFS volunteers. “Your boarding and lodging arrangements will be taken care of”, the Addnl.EO said.

Temple DyEO Sri Harindranath, PRO Dr T Ravi, retired TTD officers were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

పిడ‌బ్ల్యుఎఫ్ఎస్ సేవ‌పై టిటిడి అద‌న‌పు ఈవో స‌మీక్ష‌

తిరుమల, 29 నవంబర్‌ 2019: పిలిగ్రిమ్ వెల్ఫేర్ ఫెసిలిటేష‌న్ స‌ర్వీస్‌(పిడ‌బ్ల్యుఎఫ్ఎస్‌)పై శుక్ర‌వారం తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఇత‌ర ప్రాంతాల్లో భ‌క్తుల సౌక‌ర్యాల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు ఉద్దేశించిన పిడ‌బ్ల్యుఎఫ్ఎస్ సేవ‌లో ఇప్ప‌టివ‌ర‌కు శ్రీ‌వారి సేవ‌కులు పాల్గొంటున్నార‌ని చెప్పారు. టిటిడి రిటైర్డ్ ఉద్యోగులు ప‌లువురు ఆస‌క్తి క‌న‌బ‌రిచార‌ని, వారి సేవ‌ల‌ను కూడా పిడ‌బ్ల్యుఎఫ్ఎస్ సేవ‌లో వినియోగించుకుంటామ‌ని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులు స్వ‌చ్ఛందంగా సేవ చేయాల్సి ఉంటుంద‌ని, ఎలాంటి వేతనం చెల్లించేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌తో పాటు శ్రీ‌వారి ఆల‌యం, ల‌డ్డూ కాంప్లెక్స్‌, రిసెప్ష‌న్ త‌దిత‌ర విభాగాల్లో వీరి సేవ‌ల‌ను వినియోగించుకుంటామ‌ని తెలిపారు.

ఈ స‌మావేశంలో శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, ప్ర‌జాసంబంధాల అధికారి డా. టి.ర‌వి, రిటైర్డ్ ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, రిటైర్డ్ ఏఈవోలు శ్రీ కేశ‌వ‌రాజు, శ్రీ ఆనంద్‌, శ్రీ శివారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.