RESPECTS PAID TO SADHU SUBRAHMANYA SHASTRY _ ఘనంగా శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి 37వ వర్ధంతి
Tirupati, 10 September 2018: TTD officials offered floral tributes to the renowned scholar, epigraphist, first peishkar of Tirumala temple Sri Sadhu Subrahmanya Shastry, on his 37th Death Anniversary.
Sri Shastry translated about 1147 inscriptions laid on the walls of Tirumala temple during his service in TTD.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఘనంగా శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి 37వ వర్ధంతి
తిరుపతి, 2018 సెప్టెంబరు 10: తిరుమలలోని శాసనాలను అనువదించి స్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి 37వ వర్ధంతి సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా గల శ్రీ సుబ్రమణ్యశాస్త్రి కాంస్య విగ్రహానికి టిటిడి అధికారులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా శ్వేత సంచాలకులు శ్రీ ఎన్.ముక్తేశ్వరరావు మాట్లాడుతూ శ్రీమాన్ సాధు సుబ్రమణ్యశాస్త్రి శ్రీవారి ఆలయ పేష్కారుగా ఉంటూ ఎపిగ్రఫిస్టుగా 1167 రాగిరేకుల శాసనాలను సేకరించి అనువదించినట్టు తెలిపారు. ఈయన కారణంగానే శ్రీవారి వైభవం, తిరుమల చరిత్ర విశేషాలు వెలుగులోకి వచ్చాయన్నారు. అన్నమయ్య కీర్తనల భాండాగారం నుంచి చాలా రాగి రేకులను వెలికితీసి కీర్తనలను వెలుగులోకి తెచ్చినట్టు తెలిపారు.
అదేవిధంగా, తిరుపతిలోని ఎస్వీ ప్రాచ్య కళాశాలలో శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి జీవిత విశేషాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి డా|| రమణప్రసాద్, పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా|| సముద్రాల లక్ష్మణయ్య, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు సమన్వయాధికారి ఆచార్య కెజె.కృష్ణమూర్తి, శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి కుమార్తె శ్రీమతి గిరిజాదేవి, మనవడు కడపలో న్యాయమూర్తి అయిన శ్రీ సిఎన్.మూర్తి, ఇతర కుటుంబ సభ్యులు శ్రీ కృష్ణప్రసాద్, శ్రీమతి లక్ష్మీ, శ్రీ బద్రీనాథ్, శ్రీమతి ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.