SANATANA DHARMA PRACHARA ENHANCED BY TTD_ సనాతన హైందవ ధర్మాన్ని మరింత విస్తృతంగా ప్రచారం – టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కార్యదర్శి డా||రమణ ప్రసాద్‌

Tirupati, 8 October 2018: TTD has rolled out an effective campaign for propagating Sanatana Hindu Dharma among school children, youth, women and depressed classes of society, says Dr Ramana Prasad, HDPP Secretary.

Speaking at the launch of train program for Dharma Pracharakulu organised at SVETA on Monday, he said that on directions of TTD EO Sri Anil Kumar Singhal and JEO (Tirupati) Sri P Bhaskar, HDPP took up this publicity campaign with the objective of catching the youth and the children at an young age to imprint the message of Hindu dharma in simplified and long lasting format.

He said the 50 persons from all districts of AP and Telengana, were chosen for training as Dharma Pracharaks till October 13. The goal is to train around 600 persons as 12 batches of Dharma Pracharaks by March 2019 at the rate of 50 members per batch.
Speaking on occasion Sri. Damodar Naidu, OSD of Epic Studies said the trainees should be imparted knowledge on epics like Ramayana and Mahabharata to narrate it to youth in simple language.

Smt Gayatri Sudha, a teacher of the Art of Living is one of the speakers chosen to impart training in Dharma, Goals,epic studies with PP presentations. Among others Dr Samudrala Lakshmaiah OSD of Epic studies, Telugu lecturer of SPW Degree college Smt Krishnaveni , Dharma Pracharaks from Telangana and AP and staff of the HDPP participated in the event.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సనాతన హైందవ ధర్మాన్ని మరింత విస్తృతంగా ప్రచారం – టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కార్యదర్శి డా||రమణ ప్రసాద్‌

తిరుపతి, 2018 అక్టోబరు 08: యువత, పిల్లలు, మహిళలలో సనాతన హైందవ ధర్మాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయాలని టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కార్యదర్శి డా|| రమణ ప్రసాద్‌ ఉద్ఘాటించారు. తిరుపతిలోని శ్వేతా భవనంలో హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ధర్మ ప్రచారకులకు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ పోలా భాస్కర్‌ ఆదేశాల మేరకు నేటి యువతలో సనాతన హైందవ ధర్మం, మానవీయ, నైతిక విలువలు పెంచేందుకు చిన్న వయస్సులోనే వారికి సులభంగా అర్ధమయ్యేలా, చిరకాలం గుర్తుండేలా ధర్మ ప్రచారకులు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలియజేశారు. సనాతన ధర్మం వివేకాన్ని పెంచుతుందని, ఆచరించడం ద్వారా గమ్యం చేరుకోవచ్చన్నారు. ఈ రోజు నుండి 13వతేది వరకు ఎంపికైన ధర్మప్రచారకులకు శిక్షణ ఇస్తామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన జిల్లాల నుండి 50 మందిని ఎంపిక చేశామన్నారు. ఒక్కో బ్యాచ్‌కు 50 మంది చొప్పున మార్చి 2019 వరకు దాదాపు 600 మందికి 12 బ్యాచ్‌లుగా శిక్షణ ఇస్తామన్నారు. రామాయణం, భాగవతం, భారతంలోని ప్రధాన ఘట్టాలను నేటి తరానికి అర్థమయ్యేలా సరళమైన భాషలో వివరించాలని ఎపిక్‌ స్టడీస్‌ ప్రత్యేకాధికారి డా.దామోదర్‌ నాయుడు తెలియజేశారు. హిందూ ధర్మం పవిత్రమైనదని, భారతదేశానికి హిందూ ధర్మం వెన్నెముక లాంటిదన్నారు. శ్రీ గురుదేవ్‌ రవిశంకర్‌ ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌లో శిక్షకురాలు శ్రీమతి గాయత్రి సుధా ధర్మప్రచారకులకు ధర్మపరిచయం, లక్ష్యాలు, పురాతన గ్రంథాలు తదితర అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించనున్నారు.

ఈ కార్యక్రమంలో పురాణ ఇతిహాస ప్రాజెక్ట్‌ ప్రత్యేకాధికారి డా. సముద్రాల లక్ష్మయ్య, ఎస్‌పిడబ్ల్యూ డిగ్రీ కాలేజీ తెలుగు అధ్యాపకురాలు శ్రీమతి కృష్ణవేణి, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ జిల్లాల నుండి వచ్చిన ధర్మప్రచారకులు, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.