TTD STUDENTS EXCEL IN COMPETITIVE EXAM_ ప్రతిభా పరీక్షల్లో శ్రీ కోదండరామస్వామి హైస్కూల్‌ విద్యార్థులకు స్వర్ణపతకాలు

Tirupati, 11 July 2018: The students of Sri Kodanda Rama High School of TTD excelled in the competitive exams organised at Mumbai and New Delhi.

The pupils showcased their talent in the Indian talent test conducted at Mumbai last November and in Silver Zone Foundation Olympiad test conducted at Nation’s capital this February.

Among the achievers are Chi.C Umesh, studying eighth standard, stood state first and was presented with a tab. While others includes Chi.Mahesh Babu, Kum.Kalyani, Kum.Dhanalakshmi, Chi C Harish, Chi.T Jagan, Kum.Hima Bindu, K Kum.Padma, Kum Supraja, Kum Tabu also won gold medals.

Apart from the gold medals, nine each silver and bronze also won by tye students.

Special Officer All Projects Sri N Muktheswara Rao gave away the prizes to the winners in a programme organised in school premises on Wednesday evening. Principal of the school Smt Geetanjali, faculty, students were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ప్రతిభా పరీక్షల్లో శ్రీ కోదండరామస్వామి హైస్కూల్‌ విద్యార్థులకు స్వర్ణపతకాలు

తిరుపతి, 11 జూలై 2018: ముంబయికి చెందిన ఇండియన్‌ టాలెంట్‌ సంస్థ, న్యూఢిల్లీకి చెందిన సిల్వర్‌ జోన్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన ప్రతిభా పరీక్షల్లో టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ కోదండరామస్వామి ఇంగ్లీషు మీడియం హైస్కూల్‌ విద్యార్థులు స్వర్ణ, కాంస్య పతకాలు, ఇతర బహుమతులు సాధించారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో టిటిడి ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీఎన్‌.ముక్తేశ్వరరావు విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

2017-18 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాలలో గతేడాది నవంబరులో ఇండియన్‌ టాలెంట్‌ పరీక్ష, ఈ ఏడాది ఫిబ్రవరిలో సిల్వర్‌ జోన్‌ ఫౌండేషన్‌ ఒలంపియాడ్‌ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఇందులో 7వ తరగతి చదువుతున్న బి.ధనలక్ష్మీ, 8వ తరగతి చదువుతున్న సి.హరీష్‌, ఎం.సుప్రజ, 9వ తరగతి చదువుతున్న ఎం.పద్మ, ఎస్‌.మహేష్‌బాబు, పదో తరగతి చదువుతున్న ఎం.హిమబిందు, టి.జగన్‌, పి.టబు స్వర్ణ పతకాలు సాధించారు.

8వ తరగతి చదువుతున్న సి.ఉమేష్‌ సైన్స్‌ విభాగంలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్‌ సాధించడంతో ట్యాబ్‌ను ప్రదానం చేశారు. 9వ తరగతి చదువుతున్న ఎస్‌. మహేష్‌బాబు గణిత విభాగంలో 6వ ర్యాంక్‌ సాధించడంతో రూ.700/- నగదు బహుమతి, సైన్స్‌ విభాగంలో 9వ తరగతి చదువుతున్న కె.కల్యాణి 9వ ర్యాంక్‌ సాధించడంతో రూ.500/- నగదు బహుమతులు అందించారు. వీటితోపాటు 9 వెండి పతకాలు, 9 కాంస్య పతకాలను విద్యార్థులు సాధించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కె.గీతాంజలి, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.