SEALED TENDERS FOR TRANSPORT OF TTD COLLECTIONS OF FOREIGN COINS _ విదేశీ నాణేల త‌ర‌లింపున‌కు సీల్డ్ టెండ‌ర్లు ఆహ్వానం

Tirupati, 13 Nov. 19: TTD has invited sealed tenders from qualified banks and recognized foreign exchange dealers for lifting and transportation of the foreign coins collected in TTD hundis and now kept at the treasury at the TTD admin building, Tirupati 

The foreign coins belonging to Malaysia, USA, Europe, Singapore, Australia, Canada, Lanka, Kuwait, Bahrain, Thailand, Nepal, New Zealand, Qatar and Oman etc. are collected in the Srivari Hundi at Tirumala and also at the hundis in other TTD temples.

TTD said that the sealed tenders would be opened at the office of the DyEO of Treasury and Inventories at the TTD admin building in Tirupati on November 28. Interested persons could log into the TTD website www.tirumala.org for more details.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

 

విదేశీ నాణేల త‌ర‌లింపున‌కు సీల్డ్ టెండ‌ర్లు ఆహ్వానం

తిరుపతి, 2019 నవంబరు 13: టిటిడి ఖ‌జానా విభాగంలో ఉన్న విదేశీ నాణేల త‌ర‌లింపున‌కు అర్హ‌త గ‌ల బ్యాంకులు, అధీకృత ఫారిన్ ఎక్సేంజి డీల‌ర్ల నుండి సీల్డ్ టెండ‌ర్లు ఆహ్వానించ‌డ‌మైన‌ది.

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంతో పాటు ఇత‌ర టిటిడి ఆల‌యాల్లో భ‌క్తులు హుండీ ద్వారా స‌మ‌ర్పించిన విదేశీ నాణేల‌ను ఖ‌జానా విభాగంలో భ‌ద్ర‌ప‌రిచారు. ఇందులో మ‌లేసియా, యుఎస్ఏ, యుకె, యూరో, యుఏఇ, సింగ‌పూర్‌, ఆస్ట్రేలియా, కెన‌డా, శ్రీ‌లంక‌, కువైట్‌, బ‌హ్రెయిన్‌, థాయిలాండ్‌, నేపాల్‌, మాల్దీవులు, న్యూజిలాండ్‌, హాంగ్‌కాంగ్‌, ఖ‌తార్, ఓమ‌న్ త‌దిత‌ర దేశాల నాణేలున్నాయి.

న‌వంబ‌రు 28న తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గల డెప్యూటీ ఈవో(ట్రెజ‌రీ మ‌రియు ఇన్వెంట‌రీ) కార్యాల‌యంలో సీల్డ్ టెండ‌ర్లు తెరుస్తారు. ఇత‌ర వివ‌రాల‌కు టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org ను సంప్ర‌దించ‌గ‌ల‌రు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.