SEMINAR ON “LEAD INDIA 2020 _ స్వామివివేకానంద భారతదేశానికి స్పూర్తి – ” లీడ్‌ ఇండియా 2020 ” ప్రారంభించిన టిటిడి ఈవో శ్రీ కె.వి.రమణాచారి

 స్వామివివేకానంద భారతదేశానికి స్పూర్తి

–  ” లీడ్‌ ఇండియా 2020   ” ప్రారంభించిన టిటిడి ఈవో శ్రీ కె.వి.రమణాచారి

తిరుపతి, జూన్‌-27,  2008: ఒకప్పుడు స్వామివివేకానంద భారతదేశానికి స్పూర్తినందిచాడని ఆయన స్పూర్తి అనేక మంది జీవితాలలో వెలుగును నింపిందందని తితిదే కార్యనిర్వాహణాదికారి శ్రీ కె.వి.రమణాచారి అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక శ్వేత నందు ”లీడ్‌ ఇండియా 2020” అను కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి అధ్యక్షోపన్యాసం చేశారు.

 ఈ సందర్భంగా ఇ.ఓ మాట్లాడుతూ అద్యాపకులుగా వున్నవారు అనేకరకాల వృత్తిలో స్థిరపడే విధంగా తమ శిష్యులను తయారుచేసే సౌలభ్యం వుందని, విద్యార్థులను సన్మార్గం వైపు నడిపించేది గురువేనని చెప్పారు. విద్యార్థులలో దైవభక్తి, దేశభక్తినికూడా పెంపోందించాల్సిన బాధ్యత కూడా గురువులదేనని, అదే విధంగా మంచి సమాజాన్ని చూడాలంటే గురువులకే సాధ్యమని చెప్పారు. ప్రతివిద్యార్థి నీతిశతకాలలో ఒక పద్యాన్ని నేర్చుకోవాలని గురువులు చెప్పేవారని దీని ఉద్దేశ్యం విద్యార్థులలో నీతిని పెంపొందించడమే అన్నారు.

అబ్దుల్‌ కలాం తనమాట, తన సందేశం ద్వారా ఎంతోమందికి స్పూర్తి ప్రధాత అయిన గొప్పవ్యక్తి అని ఆయన సేవలను కొనియాడారు. అంతటి వయస్సులోను ఆయన హుషారుగా పిల్లల దగ్గరకు వెళ్ళి వారిని ఉత్సాహపరుస్తున్నారని,అయితే నేడు మనం ఏమి చేస్తున్నామో అందరూ ఆలోచించాలని చెప్పారు. నేడు పసి పిల్లలలో మంచి బీజాన్ని వేయడం మనధర్మమని, అదేరీతిలో వ్యక్తిగా సమాజాన్ని సంస్కరిండానికి, సమాజానికి స్నేహహస్తాన్ని అందించడానికి నేను ఎల్లప్పుడూ ముందుంటానని శ్రీరమాణాచారి అన్నారు. మనం చేయాల్సిన పనులు తపనతో చేయాలని, ఆవేశం కన్నా ఆలోచనలతో కూడిన ఆవేశం వుండాలని, ఆశయంతో పాటు ఆచరణ పుండాలని, అదేవిధంగా మన పిల్లల్ని మంచివైపు కార్యోన్ముఖులను చేయడానికి ప్రతి ఒక్కరు కృషిచేయాలని ఆయన అధ్యాపకులను కోరారు.

ఈ సందర్భంగా ”లీడ్‌ ఇండియా 2020” వ్యవస్థాపకులు, జాతీయ కో-ఆర్డినేటర్‌ అయిన శ్రీసుదర్శనాచార్యులు  మాట్లాడుతూ ఆనాడు వందేమాతరం పిలుపు జాతిని ఏవిధంగా ఏకం చేసిందో అదే విధంగా ”లీడ్‌ ఇండియా” అనే నినాదం ఇప్పుడు మనల్ని ఏకం చేస్తున్నదని ఆయన చెప్పారు.

శ్వేత డైరెక్టర్‌ శ్రీభూమన్‌ మాట్లాడుతూ  మనం మన కుటుంబాల్ని చూసుకోవడమే గాక మనచుట్టూ వున్న సమాజాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరంవుంది. ఈ సమాజంలో మంచి మార్పురావాలంటే టీచర్లు ముఖ్య పాత్ర తీసుకోవాలని చెప్పారు. తి.తి.దే.,విద్యాశాఖాధికారి డా||శ్యాంసుందర నాయుడు సమావేశంలో ప్రారంభోపన్యాసం చేశారు.

ఈ కార్యక్రమంలో తిరుపతిలోని పలు పాఠశాలలు, కళాశాలలో పనిచేసే దాదాపు 500 మంది అధ్యాపకులు హాజరైయ్యారు. ఈ ”లీడ్‌ ఇండియా 2020” సెమినార్‌ను జూన్‌ 27 నుండి జూలై 1 వరకు ఐదురోజులపాటు నిర్వహిస్తారు. వారిలో ఎంపికైన అధ్యాపకులకు శిక్షణ ఇచ్చి వివిధ పాఠశాలలకు పంపి విద్యార్థులలో చైతన్యం తీసుకురావడానికి కృషిచేస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.