SESHACHALA ARE TREASURE HOUSE FOR MEDICINAL PLANTS-EXPERTS _ శేషాచలం అడవులు ఔషధ మొక్కల సంపదకు నిధి
TIRUPATI, 10 SEPTEMBER 2023: Seshachalam forests, the abode of Sri Venkateswara Swamy, are a treasure house for the rich sources of medicinal plants in Andhra Pradesh and there is every need to safeguard the rare medicinal flora, said Dr Koustubha Upadhyaya, Advisor Ayurveda, Ministry of AYUSH, New Delhi.
To explore the medicinal plants of Seshachalam Forests and to identify their medicinal uses, Rashtriya Ayurveda Vidyapeeth, New Delhi (National Academy of Ayurveda) An autonomous organization under the Ministry of AYUSH, Govt. of India, in Association with SV Ayurvedic College, Tirupati, floated a three-day training programme on “Identification of Flora at Tirumala Hills of Tirupati through field visits” which commenced on Sunday at SV Ayurvedic College in Tirupati on Sunday evening.
Speaking during the meeting Dr Kasyapa said this training program will help to understand and explore the medicinal plants and their uses for disease-free life as there is a dire need today for preparing pure medicines from natural herbs.
Earlier Deputy CF of TTD Sri Srinivasulu also explained about the rare species of flora found in Seshachala ranges and the eco-friendly measures by TTD.
Principal Dr Muralikrisha, Vice-Principal Dr Sundaram, Dr Pavan Kumar, about 30 delegates from various parts of India participated in this program.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శేషాచలం అడవులు ఔషధ మొక్కల సంపదకు నిధి
– ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుర్వేద సలహాదారు డాక్టర్ కౌస్తుభ ఉపాధ్యాయ
తిరుపతి, 2023 సెప్టెంబరు 10: శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న శేషాచలం అడవులు ఔషధ మొక్కల సంపదకు నిధి అని ఇక్కడ ఉన్న అరుదైన ఔషధ వృక్ష సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుర్వేద సలహాదారు డాక్టర్ కౌస్తుభ ఉపాధ్యాయ అన్నారు.
శేషాచలం అడవులలోని ఔషధ మొక్కలను అన్వేషించడానికి , వాటి ఔషధ ఉపయోగాలను గుర్తించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ, టీటీడీ ఆయుర్వేద కళాశాల, సహకారంతో, ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో ఆదివారం సాయంత్రం “క్షేత్ర సందర్శనల ద్వారా తిరుమల కొండలలో వృక్షజాలాన్ని గుర్తించడం” అనే అంశంపై మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది.
సమావేశంలో డాక్టర్ కౌస్తుభ మాట్లాడుతూ, సహజ మూలికల నుండి స్వచ్ఛమైన మందులను తయారుచేయడం నేడు ఎంతో అవసరం కాబట్టి ఔషధ మొక్కలు, వాటి ఉపయోగాలను తెలుసుకుని వ్యాధి రహిత జీవనం కోసం ఈ శిక్షణా కార్యక్రమం దోహదపడుతుందన్నారు.
అంతకుముందు టీటీడీ డిప్యూటీ సిఎఫ్ శ్రీ శ్రీనివాసులు శేషాచల అడవుల్లో కనిపించే అరుదైన వృక్ష జాతులు పర్యావరణ అనుకూల చర్యల గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరం, డాక్టర్ పవన్‌కుమార్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.