SHARANAGATI WAS TAUGHT BY ANNAMAIAH _ భక్తులకు శరణాగతి నేర్పిన అన్నమయ్య : ఆచార్య క‌ట్ట‌మంచి మ‌హాల‌క్ష్మి

TIRUPATI, 16 MAY 2022: Renowned scholar Smt Kattamanchi Mahalakshmi described Annamacharya as a social reformer who brought societal enlightenment with his incredible Sankeertans.

 

Speaking in the literary sadas arranged by TTD on the occasion of 614th Jayanthi of Annamacharya at Annamacharya Kalamandiram in Tirupati on Monday evening she said, Annamaiah used Astakshari Mantram in his Sankeertans and taught people the easy way of attaining salvation through Bhagavat Nama Smarana.

 

TTD officials, denizens were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

భక్తులకు శరణాగతి నేర్పిన అన్నమయ్య : ఆచార్య క‌ట్ట‌మంచి మ‌హాల‌క్ష్మి

తిరుపతి, 2022 మే 16: భగవంతుని తత్వాన్ని తెలుసుకునేందుకు శరణాగతి తప్ప మరో మార్గం లేదని భక్తులకు అన్నమయ్య తెలియజేశారని ఆచార్య క‌ట్ట‌మంచి మ‌హాల‌క్ష్మి పేర్కొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 614వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సులు సోమ‌వారం ప్రారంభ‌మ‌య్యాయి.

ఈ సంద‌ర్భంగా తిరుప‌తికి చెందిన ఆచార్య క‌ట్ట‌మంచి మ‌హాల‌క్ష్మి ”అన్నమయ్య సంకీర్తనలు – వైష్ణవభక్తి ” అనే అంశంపై ఉపన్యసిస్తూ ప్రసిద్ధ శ్రీవైష్ణవాచార్యులు భగవద్‌ రామానుజులు తెలియజేసిన అష్టాక్షరి మంత్రాన్ని అన్నమయ్య తన సంకీర్తనల ద్వారా వ్యాప్తి చేసినట్టు తెలిపారు. ఇందులో అహింస, సచ్ఛీలత, భక్తి, శరణాగతి, నామసంకీర్తనం ప్రధానంగా ఉన్నాయన్నారు. హింసకు దూరంగా ఉండి భగవంతునిపై పూర్తి విశ్వాసంతో నామసంకీర్తనం చేస్తే ముక్తి కలుగుతుందని అన్నమయ్య కీర్తనల ద్వారా అవగతమవుతుందని వివ‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ అధికారులు, భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది