SHODASA DINATMAKA ARANYAKANDA TO CONCLUDE ON JULY 10 _ జూలై 10న ముగియనున్న ” షోడ‌శ‌దినాత్మ‌క అర‌ణ్య‌కాండ‌ పారాయ‌ణ దీక్ష “

TIRUMALA, 05 JULY 2022: Shodasa Dinatmaka Aranyakanda Parayana Deeksha is set to conclude on July 10 at Tirumala.

TTD has been organising several Parayanams from the past two years for the benefit of humanity.

The 16-day unique Shodasadinatmaka Aranyakanda Parayana Deeksha commenced on June 25.

All the 2454 Shlokas from 75 chapters of Aranyakanda in the epic Ramayana is being recited by 16 Vedic Scholars at Vasanta Mandapam in Tirumala every day from 8:30am onwards. Simultaneously another set of 16 Ritwiks have been performing Japa-Tapa-Homa in Dharmagiri Veda Vignana Peetham seeking the divine blessings for the well-being of humanity.

On the last day on July 10, Maha Purnahuti will be performed at Dharmagiri between 11 am and 12 noon culminating the 16-day fete.

SVBC has been live telecasting the program for the sake of global devotees.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జూలై 10న ముగియనున్న ” షోడ‌శ‌దినాత్మ‌క అర‌ణ్య‌కాండ‌ పారాయ‌ణ దీక్ష “

తిరుమల, 2022 జూలై 05: సృష్టిలోని స‌క‌ల జీవ‌రాశులు సుభిక్షంగా ఉండాల‌ని, స‌క‌ల కార్యాలు సిద్ధించాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ టీటీడీ చేపట్టిన ” షోడ‌శ‌దినాత్మ‌క‌ అర‌ణ్య‌కాండ‌ పారాయ‌ణ దీక్ష ” జూలై 10వ తేదీ పూర్ణాహుతితో ముగియనుంది. తిరుమ‌ల‌లోని వ‌సంత మండ‌పంలో జూన్ 25న ఈ దీక్ష ప్రారంభమైంది.

“రామ‌స్య‌పాదౌజ‌గ్రాహ‌ల‌క్ష్మ‌ణ‌స్య‌చ‌ధీమ‌తః ” అనే మహామంత్రం ప్రకారం అర‌ణ్య‌కాండలోని మొత్తం 75 స‌ర్గ‌ల్లో 2,454 శ్లోకాల‌ను 16 మంది ఉపాసకులు 16 రోజుల పాటు అత్యంత దీక్షాశ్రద్ధలతో పారాయ‌ణం చేస్తున్నారు.

వ‌సంత మండ‌పంలో శ్లోక పారాయ‌ణంతోపాటు ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌లో మ‌రో 16 మంది ఉపాస‌కులు 16 రోజుల పాటు జ‌ప‌, త‌ర్ప‌ణ‌, హోమాదులు నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల కోసం ప్ర‌తిరోజూ ఉద‌యం 8.30 గంట‌లకు ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తోంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.