SHRAVANA UPAKARMA AT SRI GOVINDARAJA SWAMY TEMPLE ON AUGUST 28 _ ఆగస్టు 28న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా శ్రావణ ఉపకర్మ

SNAPANA TIRUMANJANAM AT ALWAR THEERTHAM IN KAPILA THEERTHAM

Tirupati, August 25, 2026: The Sri Govindaraja Swamy Temple, Tirupati, will observe the sacred Shravana Upakarma on August 28 on the occasion of Shravana Pournami, as per Agama traditions.

At 6.30 am, Sri Govindaraja Swamy and Sri Krishna Swamy will be taken in a ceremonial procession to Alwar Theertham at Kapila Theertham, where Snapana Tirumanjanam and Asthanam will be performed.

Later, from 4.30 pm to 6.30 pm, Sri Bhudevi-sametha Govindaraja Swamy will be offered Asthanam at the Sri Vaikhanasacharya Temple on R.S. Mada Street. The deities will then return to the main temple.

TTD appeals to devotees to participate in the sacred Shravana Upakarma and seek the divine blessings of Lord Govindaraja Swamy.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

ఆగస్టు 28 శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా శ్రావణ ఉపకర్మ

కపిలతీర్థంలోని ఆళ్వార్‌తీర్థంలో స్వామివారికి స్నపన తిరుమంజనం – 

ఆర్‌.ఎస్‌. మాడ వీధిలోని వైఖానసాచార్యుల ఆలయంలో ఆస్థానం

తిరుపతి, 2026 ఆగస్టు 25: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని ఆగస్టు 28వ తేదీన శ్రావణ ఉపకర్మను ఆగమోక్తంగా, భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఉదయం 6.30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారిని మంగళవాయిద్యాల నడుమ కపిలతీర్థంలోని ఆళ్వార్‌తీర్థానికి ఊరేగింపుగా తీసుకువెళతారు. అక్కడ స్వామివారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం, ఆస్థానం నిర్వహిస్తారు.

అనంతరం సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు ఆర్‌.ఎస్‌. మాడ వీధిలోని శ్రీ వైఖానసాచార్యుల ఆలయంలో శ్రీ భూసమేత గోవిందరాజస్వామివారికి ఆస్థానం నిర్వహించనున్నారు.

 అనంతరం స్వామివారు తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

శ్రావణ పౌర్ణమి పర్వదినాన నిర్వహించే ఈ పవిత్ర శ్రావణ ఉపకర్మలో భక్తులు పాల్గొని స్వామివారి దివ్య మంగళానుగ్రహాన్ని పొందాలని టీటీడీ కోరుతోంది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది