SODASADINA KISHKINDAKANDA PARAYANAM TO CONCLUDE _ జూలై 15న ముగియనున్న షోడశదిన కిష్కింధాకాండ పారాయణదీక్ష
TIRUMALA, 14 JULY 2023: Sodasadina Kishkindakanda Parayanam which commenced on a grand religious note in Vasanta Mandapam at Tirumala on June 30 will conclude on July 15.
SVBC is telecasting live everyday for the sake of global devotees.
On Saturday the shlokas from the last four sargas will be recited by the Ritwiks between 8:30am and 10am.
Purnahuti will be observed at Dharmagiri Veda Vignana Peetham marking the completion of the religious programme.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూలై 15న ముగియనున్న షోడశదిన కిష్కింధాకాండ పారాయణదీక్ష
తిరుమల, 2023, జూలై 14: తిరుమల వసంత మండపంలో జరుగుతున్న షోడశదిన కిష్కింధాకాండ పారాయణదీక్ష జూలై 15న శనివారం ముగియనుంది. ఉదయం 8.30 నుండి 10 గంటల వరకు వసంతమండపంలో పారాయణం జరుగుతుంది.
“మారుతస్య సమోవేగే గరుడస్య సమోజవే” అనే శ్లోకంలో చివరి అక్షరానికి సూచికగా చివరి రోజు 4 సర్గలను పండితులు పారాయణం చేస్తారు. వసంత మండపంలో 16 మంది వేద పండితులు శ్లోకాలను పారాయణం చేస్తున్నారు.
అదేవిధంగా, ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తారు. ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్.అవధాని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.