Special Abhisekam on December 10 _ డిసెంబర్ 10న బేడి ఆంజనేయస్వామివారికి ప్రత్యేక అభిషేకం

Tirumala,09 December 2023:  TTD is organising a special Abhisekam at Sri Lakshmi Narasimha Swamy temple in first ghat road on the advent of Swati Nakshatram, the birth star of the deity, on Sunday, the December 10.

TTD officials will participate in this special pooja event.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

డిసెంబర్ 10న బేడి ఆంజనేయస్వామివారికి ప్రత్యేక అభిషేకం

తిరుమల, 2023 డిసెంబర్ 09: తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా వెలసివున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి డిసెంబర్ 10వ తేదీన ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు.

కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ.

శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మూలమూర్తికి ఉదయం పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపులతో విశేషంగా అభిషేకం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు ఆలయ అర్చకులు పాల్గొంటారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.