SPECIAL ABHISHEKAM PERFORMED TO KALIMARDANA CHINNI KRISHNA AT TIRUMALA _ తిరుమలలో కాళీయమర్ధన చిన్నికృష్ణుడికి విశేష అభిషేకం

Tirumala 30, August 2021: As part of Sri Krishna Janmashtami celebrations, the TTD Garden Department organized grand festivities in Tirumala in total adherence to COVID guidelines.

The festivities like special pujas and Panchamruta Abhishekam were performed to the majestic statue of Kalimardana Chinni Krishna at Gogarbham Dam followed by distribution of Prasadam.

TTD Garden Department Deputy Director Sri Srinivasulu and VGO Sri Bali Reddy and other officials were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమలలో కాళీయమర్ధన చిన్నికృష్ణుడికి విశేష అభిషేకం

తిరుమల, 2021 ఆగస్టు 30: తిరుమలలో సోమవారం నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వ‌ర్యంలో ఘనంగా నిర్వహించారు. కోవిడ్ 19 నేపథ్యంలో ఏకాంతంగా ప్రత్యేక అభిషేకం, ఉట్లోత్సవం జరిగాయి.

గోగర్భం డ్యామ్‌ చెంతగల ఉద్యానవనంలో కాళీయమర్ధనుడు అయిన చిన్నికృష్ణునికి  ఉదయం 11 గంట‌ల నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, కొబ్బ‌రినీళ్ళు, ప‌సుపు, కుంకుమ‌, చంద‌నం, పంచామృతాభిషేకాలు చేశారు. ఆ తరువాత ప్రసాద వితరణ జరిగింది.

ఈ కార్యక్రమంలో ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్‌, విజిఓ శ్రీ బాలిరెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.