SPECIAL SPIRITUAL PROGRAMS _ శ్రీ‌వారి నవరాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో వేద‌ఘోష‌

TIRUMALA, 14 OCTOBER 2023: In connection with the Navaratri Brahmotsavams in Tirumala from October 15-23, TTD has mulled special devotional and spiritual programs along with its SV Recording Project at Nada Neerajanam platform in Tirumala.

As a part of it, starting on Sunday, October 15, there will be Veda Parayanam every day between 5am and 5:45am followed by discourses on Veda Vignanam by renowned Vedic scholars.

Vedic exponents like Maha Mahopadhyaya Sri Chirravuri Sreerama Sharma, Vedanta Visarada Sri Vempati Kutumba Shastry, Dr Alladi Mohan, Prof. Chakravarthy Ranganathan, Sri Rani Sadasiva Murty, Sri Devanathan, Sri Krishnamurthy will render discourses on subjects like Panchadasa Samskaras, Rigveda, Vedic Medicine, Kathopanishad, significance of Vedas in Modern Sciences etc. on each day.

In the evening, renowned vocalists including Sri Phaninarayana and Nemani Parthasaradi, Dr Mohan Krishna, Smt Srinidhi, Sri Pavankumar Charan, Prof. Saileswari, Smt Rani Srinivasa Sarma, Sri Vasu Rao, Sri Modumudi Sudhakar, Sri Ramachary with their teams will render performances on Nada Neerajanam platform between 4:30pm and 6pm on each day during the Navaratri Brahmotsavams.

TTD Chairman Sri B Karunakara Reddy, EO Sri AV Dharma Reddy will participate in the inaugural programmes.

TTD SV Recording Project Special Officer Dr Vibhishana Sharma is supervising the arrangements which will be live telecasted on SVBC for the sake of global devotees.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

శ్రీ‌వారి నవరాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో వేద‌ఘోష‌

– ప్ర‌ముఖ పండితుల‌తో ధార్మికోప‌న్యాసాలు

– ప్రముఖ కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు

– ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ఆధ్వ‌ర్యంలో వేద విద్వ‌త్ స‌ద‌స్సు

తిరుమ‌ల‌, 2023 అక్టోబర్ 14: శ్రీ‌వారి నవరాత్రి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా టీటీడీ శ్రీ వేంక‌టేశ్వ‌ర ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ మరియు ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్‌ ఆధ్వ‌ర్యంలో అక్టోబర్ 15 నుండి 23వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల నాదనీరాజనం వేదికపై ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజుల పాటు ఉద‌యం 5 నుడి 5.45 గంట‌ల వ‌ర‌కు వేద విద్యార్థులు చ‌తుర్వేదాల‌తో వేద‌ఘోష వినిపిస్తారు. ఉద‌యం 5.45 నుండి 6.45 గంట‌ల వ‌ర‌కు దేశంలోని ప్ర‌ముఖ‌ పండితుల‌తో వేద విజ్ఞానంపై స‌ద‌స్సు నిర్వ‌హిస్తారు.

ఇందులో భాగంగా మహా మహోపాధ్యాయ శ్రీ చిర్రావూరి శ్రీరామశర్మ, వేదాంత విశారద శ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి, డాక్టర్ అల్లాడి మోహన్, ఆచార్య చక్రవర్తి రంగనాథన్, శ్రీ రాణి సదాశివ మూర్తి, శ్రీ దేవనాథన్, శ్రీ కృష్ణమూర్తి వంటి వేద శాస్త్రజ్ఞులు పంచదశ మేమిగ్వే సంస్కారాలు, వేద సంబంధమైన సంస్కారాలు, వేద సంబంధమైన సంస్కారాలు, వేద సంబంధమైన సంస్కారాలు, కఠోపనిషద్, ఆధునిక శాస్త్రాలలో వేదాల ప్రాముఖ్యత తదితర అంశాలపై ఉపన్యాసించనున్నారు.

అదేవిధంగా ప్రతి రోజు సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు ప్రముఖ గాయకులు శ్రీ ఫణినారాయణ, నేమని పార్థసారధి, డాక్టర్ మోహన్ కృష్ణ, శ్రీమతి శ్రీనిధి, శ్రీ పవన్‌కుమార్ చరణ్, ప్రొఫెసర్ శైలేశ్వరి, శ్రీమతి రాణి శ్రీనివాస శర్మ, శ్రీ వాసురావు, శ్రీ మొదుముడి సుధాకర్, శ్రీరామాచారి తమ బృందాలతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి, ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. టీటీడీ ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి డాక్టర్ విభీషణ శర్మ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.