ఫిబ్రవరి 18న మహతిలో టిటిడి ఉద్యోగుల క్రీడోత్సవాల ముగింపు సమావేశం

ఫిబ్రవరి 18న మహతిలో టిటిడి ఉద్యోగుల క్రీడోత్సవాల ముగింపు సమావేశం

తిరుపతి, 2019 ఫిబ్రవరి 17: టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమం ఫిబ్రవరి 18వ తేదీ సోమవారం సాయంత్రం 6.00 గంటలకు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించనున్నారు.

టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు-2019 ఫిబ్రవరి 2వ తేదీ ప్రారంభమై ఫిబ్రవరి 17వ తేదీతో ముగియనున్న విషయం విధితమే. ఇందులో భాగంగా టగ్‌ ఆఫ్‌ వార్‌, చెస్‌, వాలీబాల్‌, క్యారమ్స్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, టేబుల్‌ టెన్నిస్‌, క్రికెట్‌, షటిల్‌, టెన్నిస్‌ తదితర క్రీడలు నిర్వహించారు.

ఈ సందర్భంగా క్రీడాపోటీలలో విజేతలకు బహుమతులు ప్రధానం చేయనున్నారు. అనంతరం టిటిడి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.