SPORTS MEET ACTS AS A STRESS BURSTER TO EMPLOYEES-JEO_ శారీరక ధృడత్వంతో పాటు మానసిక ఉత్తేజంతో భక్తులకు మరింత మెరుగైన సేవలందించాలి: టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం

Tirupati, 18 Feb. 19:To enhance the working spirit among employees who are discharging duties in pilgrim service day and night in a hale and healthy environment, sports acts as stress burster, said, JEO Tirupati Sri B Lakshmikantham.

The valedictory function of annual sports meet took place at Mahati Auditorium in Tirupati on Monday evening. JEO who graced the occasion as chief guest in his address given valuable health tips to the employees on how to keep the body fit to execute daily activities with more energy.

Thr JEO called upon the employees to strictly follow good food habits and perfect dietary to keep body, mind and soul healthy.

He wished all the employees to regularly take part in sports and games. Later je gave away prizes to winners.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శారీరక ధృడత్వంతో పాటు మానసిక ఉత్తేజంతో భక్తులకు మరింత మెరుగైన సేవలందించాలి: టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం

తిరుపతి, 2019 ఫిబ్రవరి 18: ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక సంస్థ అయిన టిటిడిలో విధులు నిర్వహించే ఉద్యోగులు శారీరక ధృడత్వంలోపాటు, మానసిక ఉత్తేజంతో భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు క్రీడలు అవసరమని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం అన్నారు. టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమం సోమవారం సాయంత్రం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జెఈవో ప్రసంగిస్తూ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు ప్రతి రోజు విచ్చేసే వేలాది మంది భక్తులకు విశేష సేలందిస్తున్న ఉద్యోగులు తీవ్ర వత్తిడితో విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఈ వత్తిడిని అదిగమించడానికి, శారీరక ఆరోగ్యనికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. టిటిడిలో పనిచేయడం ఉద్యోగంగా భావించకూడదని, అది సేవాభాగ్యమన్నారు. క్రీడల ద్వారా మనలోని క్రొత్త కోణాలు వెలికి తీసుకురవచ్చన్నారు. ప్రతి రోజు క్రీడలు, వ్యాయమం చేయాలని, ఉద్యోగులలో క్రీడా స్పూర్తి పెరిగితే ఆరోగ్యంగా వుంటారని సూచించారు. క్రీడలలో పాల్గొనడం ద్వార పోటితత్వం, మానసికంగా ఉల్లాసం వృద్ధి చెందుతాయన్నారు.

అనంతరం సంపూర్ణ ఆరోగ్యం కొరకు తీసుకోవలసిన ఆహార పదార్థలు, ఆహార నియమాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు. ప్రతి ఒక్కరు 3 నెలలకు ఒకసారి ఆరోగ్య పరిక్షలు చేయించుకోవాలన్నారు. అందులో భాగంగా టిటిడి ఉద్యోగులందరికి ఆరోగ్య శిభిరం ఏర్పాటు చేయనున్నాట్లు తెలిపారు.

అంతకుముందు టీటీడీ ఉద్యోగుల పిల్లలకు సాంస్కృతిక పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.

కాగా, వివిధ క్రీడాపోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి జెఈవో చేతులమీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఉద్యోగుల్లో మొత్తం 532 మంది ప్రథమ, 525 మంది ద్వితీయ, 88 మంది తృతీయ బహుమతులు అందుకున్నారు. మొత్తం వివిధ విభాగాల్లో 1197 మంది ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు క్రీడాపోటీల్లో పాల్గొన్నారు. వీరిలో 790 మంది పురుషులు, 407 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు.

అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రార్థన గాతంతో కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గురువారం జరిగిన ఉగ్రవాదదాడిలో మరణించిన 42 మంది అమర జవాన్లకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.

అనంతరం టిటిడి వార్షిక క్రీడా పోటీల నివేదికను శ్రీ అశోక్‌కుమార్‌ వివరించగా, టిటిడి సంక్షేమాధికారి శ్రీమతి సేహలత ముగింపు సందేశం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు శ్రీమతి ఝాన్సీరాణి, శ్రీ దేవేంద్రబాబు, డిఇ శ్రీ రవిశంకర్‌రెడ్డి, విజివో శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌, ఇఇలు శ్రీ జగన్మోహన్‌రెడ్డి, శ్రీ మల్లిఖార్జున ప్రసాద్‌, శ్రీరవిప్రభాకర్‌, శ్రీ నాగేశ్వరరావు ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.