SPORTS MEET ENTERS TENTH DAY _ ఉత్సాహంగా టీటీడీ ఉద్యోగుల క్రీడాపోటీలు
TIRUPATI, 11 FEBRUARY 2023: The annual sports and games for TTD employees entered the tenth day on Saturday in Tirupati.
Under special category sports, Ball Throw, Shotput throw, general category 45 above women shuttle, below 45 category shuttle single and doubles were conducted.
Bucketing the ball, walkathon were also conducted.
ఉత్సాహంగా టీటీడీ ఉద్యోగుల క్రీడాపోటీలు
తిరుపతి, 11 ఫిబ్రవరి 2023: టీటీడీ ఉద్యోగుల క్రీడాపోటీల్లో భాగంగా శనివారం జరిగిన పోటీల వివరాలు ఇలా ఉన్నాయి.
– అంధుల బాల్ త్రో పోటీల్లో మల్లికార్జున రెడ్డి ప్రథమ, ప్రసాద్ రెడ్డి ద్వితీయ, రామానుజమ్మ తృతీయ స్థానాలు సాధించారు.
– అంధుల షాట్ పుట్ పోటీల్లో లక్ష్మీపతి ప్రథమ, దేవేంద్రనాథ్ ద్వితీయ, ప్రసాద్ రెడ్డి తృతీయ స్థానాల్లో నిలిచారు.
– 45 సంవత్సరాల పైబడిన మహిళల షటిల్ పోటీల్లో పద్మ విజయం సాధించగా, సుగుణమ్మ రన్నరప్ గా నిలిచారు.
– 45 సంవత్సరాల లోపు షటిల్ డబుల్స్ పోటీల్లో చిన్నమునెమ్మ, సరస్వతి జట్టు విజయం సాధించగా, అలేఖ్య, సౌజన్య జట్టు రన్నరప్ గా నిలిచింది.
అదేవిధంగా, నడక, బకెటింగ్ ది బాల్ తదితర పోటీలు జరిగాయి.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.