SPREAD AWARENESS ON AYURVEDIC NUTRITION- JEO(H&E) _ ఆయుర్వేద వైద్యం పై ప్రజలకు అవగాహన కల్పించాలి
Tirupati,10 November 2023: TTD JEO for Health and Education Smt Sada Bhargavi advocated that awareness on nutritional values explained in Ayurveda should be spread not only in villages but also among school and college students.
Participating in the National a Ayurveda Day celebrations as part of Bhagvan Dhanwantari Jayanti on Friday at the SV Ayurveda college in Tirupati, the JEO said many programs were drawn for inculcation of Ayurveda nutrition among children from November 6-10.
She also appealed that medicinal and nutritional values of Ayurveda should be popularised for the good of humanity.
SV Ayurveda College Principal Dr Renu Dixit, other Ayurvedic doctors, students and staff were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఆయుర్వేద వైద్యం పై ప్రజలకు అవగాహన కల్పించాలి
– జాతీయ ఆయుర్వేద దినోత్సవ సదస్సులో జేఈవో శ్రీమతి సదా భార్గవి
తిరుపతి, 2023 నవంబరు 10: ప్రస్తుత పరిస్థితుల్లో ఆయుర్వేద వైద్యం వల్ల కలిగే ఉపయోగాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని జేఈవో శ్రీమతి సదా భార్గవి చెప్పారు.
భగవాన్ ధన్వంతరి జయంతి సందర్భంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని శుక్రవారం తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పాఠశాల, కళాశాల విద్యార్థులకు కూడా ఆయుర్వేద వైద్యం గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నవంబర్ 6 నుండి 10వ తేదీ వరకు చిన్న పిల్లలకు ఆయుర్వేదంపై అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రాచీన ఆయుర్వేదంలో ఉన్న విశేషాలను నేటి తరానికి తెలియజేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రేణు దీక్షిత్, డాక్టర్లు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.