SRAVANA UPAKARMA AT SRI GT ON AUGUST 19 _ ఆగస్టు 19న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రావణ ఉపకర్మ
Tirupati, 14 August 2024: Shravana Upakarma will be celebrated on the auspicious occasion of Sravana Pournami on August 19 at Sri Govindarajaswamy temple in Tirupati.
As part of this, at 6.30am, the processional deities of Sri Govindaraja Swamy and Sri Krishna Swamy will be taken in a procession to the Alwar Theertham in Kapilatirtham and Snapana Tirumanjanam followed by Asthanam will be performed.
From 4.30 pm to 6.30 pm Asthanam is performed to Sri Bhu Sametha Govindaraja Swamy at the Vaikhanasacharyulu temple located in RS Mada Street.
After that the utsava murthies returns to the temple.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగస్టు 19న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రావణ ఉపకర్మ
తిరుపతి, 2024 ఆగస్టు 14: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టు 19వ తేదీ శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రావణ ఉపకర్మ వైభవంగా నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా ఉదయం 6.30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ కృష్ణ స్వామివారిని కపిలతీర్ధంలోని ఆళ్వార్‌తీర్ధంకు ఊరేగింపుగా తీసుకువెళ్ళి, స్నపన తిరుమంజనం, ఆస్థానం నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల వరకు శ్రీ భూ సమేత గోవిందరాజస్వామివారు ఆర్.ఎస్. మాడ వీధిలోని శ్రీ వైఖానసాచార్యులు ఆలయంలో ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.